Warangalvoice

Amazing progress in Telangana

తెలంగాణలో అద్భుత ప్రగతి

  • అన్నిరంగాల్లోనూ గణనీయమైన ప్రగతి
  • విద్యుత్‌, తాగు,సాగునీటి రంగాల్లో విప్లవం
  • దేశానికి ఆదర్శంగా నిరంతర విద్యుత్‌
  • పచ్చగా కళకళలాడుతున్న తెలంగాణ గ్రామాలు
  • అంబేద్కర్‌ స్ఫూర్తితో దళితుల స్వాలంబన అభివృద్ధికి కృషి
  • కెసిఆర్‌ దక్షతకు తెలంగాణ సర్వతోముఖాభివృద్ది
  • అసెంబ్లీ భయసభలను ఉద్దేశించి గవర్నర్‌ తమిళసై ప్రసంగం
    వరంగల్ వాయిస్,హైదరాబాద్‌: తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని గవర్నర్‌ తమిళిసై అన్నారు. దేశ ధాన్యాగారంగా తెలంగాణ ఆవిర్భవిస్తోందని చెప్పారు. సీఎం కేసీఆర్‌ పరిపాలన దక్షత, ప్రజా ప్రతినిధుల కృషితో రాష్ట్రం ముందుకెళ్తోందన్నారు. తెలంగాణ అపూర్వ విజయాలను సాధించిందన్నారు. 24 గంటల విద్యుత్‌ సరఫరాతో తెలంగాణ విరాజిల్లుతోందని, తాగునీటి సమస్యల కోసం తల్లడిల్లిన పరిస్థితుల నుంచి తెలంగాణ బయటపడిరదని తెలిపారు. గ్రామాల్లో ఇంటింటికి ఉచిత తాగునీటి సరఫరా జరుగుతోందని అన్నారు. ఒకప్పుడు పాడుబడిన తెలంగాణ గ్రామాలు ఇప్పుడు కళకళలాడుతున్నాయని హార్షం వ్యక్తం చేశారు. అంబేద్కర్‌ స్ఫూర్తితో దళితుల స్వాలంబన అభివృద్ధికి కృషి జరిగిందని తమిళిసై సౌందరరాజన్‌ అన్నారు. సీఎం కేసీఆర్‌ సారధ్యంలోని తెలంగాణ ప్రభుత్వం, గవర్నర్‌ తమిళిసై మధ్య కొంతకాలంగా మాటల యుద్ధం.. కోర్ట్‌ జోక్యంతో బడ్జెట్‌ సమావేశాలకు ఆహ్వానం.. గవర్నర్‌ ఏం మాట్లాడబోతున్నారనే ఉత్కంఠ పరిణామాల మధ్య తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి, ముఖ్యమంత్రి కేసీఆర్‌ నమస్కరించి గవర్నర్‌ తమిళిసైకి స్వయంగా స్వాగతం పలికారు. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ తమిళిసై తెలుగులో కాళోజీ మాటలను ప్రస్తావిస్తూ ప్రసంగం మొదలుపెట్టారు. తెలంగాణ పెట్టుబడులకు స్వర్గధామం మారింద న్నారు. పచ్చదనంలో ప్రపంచ దేశాల ప్రశంసలు పొందుతోందని, దేశం నివ్వరబోయే అద్భుతాలను తెలంగాణ ఆవిష్కరిస్తోందని తమిళిసై అన్నారు. అభివృద్ధిలో దేశంలోనే అగ్రగామిగా తెలంగాణ ఎదిగిం దన్నారు. వ్యవసాయరంగంలో గొప్ప స్థిరీకరణను తెలంగాణ సాధించింది. భారీ, మధ్య, చిన్న తరహా ప్రాజెక్టులను ప్రభుత్వం పూర్తి చేసింది. 73 లక్షల 33 వేల ఎకరాలకు సాగునీటి సౌకర్యం కలిగింది. రైతుబంధు పథకం ప్రపంచవ్యాప్త ప్రశంసలు పొందుతోంది. పంటపెట్టుబడి సాయం అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. 65 లక్షల మంది రైతులకు 65 వేల కోట్ల పంట పెట్టుబడి సాయం. రైతుబీమా పథకం ద్వారా రూ.5 లక్షలు అందిస్తున్నాం. రైతులు పండిరచిన ప్రతిగింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. రాష్ట్రంలో వ్యవసాయ అభివృద్ధిపై దేశవ్యాప్త చర్చ జరుగుతోంది. 2020`21 నాటికి 2,126 యూనిట్లకు తలసరి విద్యుత్‌ వినియోగం పెరిగిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం సాధిస్తున్న సమ్మిళిత సమగ్రాభివృద్ధి యావత్‌ దేశానికి ఆదర్శప్రాయంగా నిలుస్తున్నదని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ అన్నారు. ప్రతి రంగంలోనూ దేశం ఆశ్చర్యపోయే విధంగా అద్భుతమైన ప్రగతిని ఆవిష్కరిస్తూ పురోగమిస్తున్నదని చెప్పారు. ప్రజల ఆశీస్సులు, సీఎం కేసీఆర్‌ పరిపాలనా దక్షత వల్ల తెలంగాణ అపూర్వ విజయాలు సాధించిందన్నారు. ఒకప్పుడు కరెంటు కోతలతో అంధకారంలో కొట్టుమిట్టాడిన తెలంగాణ.. ప్రభుత్వ అవిరళ కృషితో నేడు 24 గంటల విద్యుత్‌ సరఫరాతో వెలుగు జిలుగుల రాష్ట్రంగా విరాజిల్లుతున్నదని చెప్పారు. వ్యవసాయం కుదేలై విలవిలలాడిన నేల.. నేడు దేశానికే అన్నం పెట్టే ధాన్యాగారంగా అవతరించిందని పేర్కొన్నారు. తాగునీటి కోసం తల్లడిల్లిన పరిస్థితుల నుంచి పూర్తిగా బయటపడి, 100 శాతం గ్రామాల్లో ఇంటింటికీ ఉచితంగా స్వచ్ఛమైన, సురక్షితమైన జలాలను సరఫరా చేస్తున్నది వెల్లడిరచారు. ఒకనాడు పాడుబడినట్టున్న తెలంగాణ గ్రామాల రూపురేఖలు మారి, నేడు అత్యున్నత జీవన ప్రమాణాలతో ఆదర్శవంతంగా తయారయ్యాయని తెలిపారు. పెట్టుబడులకు స్వర్గధామంగా, ప్రపంచ స్థాయి సంస్థలకు గమ్యస్థానంగా, ఐటీ రంగంలో మేటి రాష్ట్రంగా ప్రగతిపథంలో పరుగులు పెడుతున్నది. పర్యావరణ పరిరక్షణలోనూ, పచ్చదనం పెంపుదలలోనూ ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నదని చెప్పారు. 2014`15లో రూ.62 వేల కోట్లుగా ఉన్న రాష్ట్ర ఆదయం.. ప్రభుత్వ కృషివల్ల 2021 నాటికి రూ.1 లక్షా 84 వేల కోట్లకు పెరిగిందన్నారు. రాష్ట్రం సిద్ధించేనాటికి రూ.లక్షా 24 వేలుగా ఉన్న తలసరి ఆదాయం.. 2022`23 నాటికి రూ.3.17 లక్షలకు చేరిందని వెల్లడిరచారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత అన్ని రంగాల్లోనూ అభివృద్ధి రెట్టింపుస్థాయిలో జరిగిందన్నారు. అన్నిరంగాల్లో పెట్టుబడి వ్యయాన్ని అధికంగా చేస్తూ అనూహ్యమైన ప్రగతిని సాధించిన ప్రభుత్వాన్ని అభినందించారు. తెలంగాణ అసెంబ్లీ డ్జెట్‌ సమావేశాలు ప్రారంభంలో ..ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ తమిళిసై ప్రసంగించారు.

    Amazing progress in Telangana
    Amazing progress in Telangana

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *