- పోపా రాష్ట్ర అధ్యక్షుడు శామంతుల శ్రీనివాస్
వరంగల్ వాయిస్, వరంగల్ : తెలంగాణ ప్రశ్నించే గొంతుక, నిజాన్ని నిర్భయంగా తెలిపే వ్యక్తి తీన్మార్ మల్లన్నను భారీ మెజారిటీతో గెలిపించాలని, తెలంగాణ రాష్ట్ర పోపా అధ్యక్షుడు, న్యాయవాది, కాంగ్రెస్ నాయకులు శామంతుల శ్రీనివాస్ గురువారం శివనగర్ ప్రచారంలో పిలుపునిచ్చారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ విద్యావంతులు, మేధావులు ఒక్కసారి అలోచించి ఓటు వేయాలని, కాంగ్రెస్ శ్రేణులు కొండా దంపతుల ఆధ్వర్యంలో కార్యకర్తలు ఇంటింటికి తిరిగి విద్యావంతుల ఓటర్లను కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న రెండవ నెంబర్ పై మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్బంగా విద్యావేత్త గట్ల రాంరెడ్డిని కలిసి మద్ధతు కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు పగడాల సతీష్, చిట్టిమల్ల శ్రీనివాస్, విజయ రాం చందర్, శామంతుల కిరణ్, మంద రాజు, కృష్ణవేణి, సంతోషిని, రాధిక, సుధాకర్, తదితరులు పాల్గొన్నారు.
