- ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
వరంగల్ వాయిస్, శాయంపేట : ప్రజల తరుఫున ప్రశ్నించే వ్యక్తి తీన్మార్ మల్లన్నను ఎమ్మెల్సీగా గెలిపించుకుందామని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. గురువారం శాయంపేట మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ సన్నాహక సమావేశం పార్టీ అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి అధ్యక్షతన నిర్వహించగా ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పాల్గొని మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల తరుఫున ప్రశ్నించే వ్యక్తి తీన్మార్ అని అన్నారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భూపాలపల్లి నుంచి అత్యధిక మెజారిటీతో మల్లన్నను గెలిపించుకుందామని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు కోరారు. తీన్మార్ మల్లన్న గెలుపు కోసం ప్రతీ ఒక్కరూ కష్టపడాలని సూచించారు. జీవో నంబర్ 46, 317 ఇతర ఉద్యోగుల సమస్యలపై కాంగ్రెస్ కేబినెట్ సబ్ కమిటీ వేసి పరిష్కరిస్తుందన్నారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రజా వ్యతిరేక విధానాలపై తీన్మార్ మల్లన్న పోరాటం చేసినట్లు ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలిపారు. కాంగ్రెస్ పార్టీ మేనిపెస్టోలో పెట్టిన ప్రతీ హామీని నెరవేరుస్తుందని తెలిపారు. ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే మళ్లీ అన్ని సంక్షేమ పథకాలు ప్రారంభమవుతాయని ఎమ్మెల్యే తెలిపారు. ఈ సమావేశంలో మండల అధికార ప్రతినిధి చిందం రవి, నాయకులు మార్క విజయకుమార్, గాజర్ల అశోక్, భాషని చంద్ర ప్రకాష్, చల్ల చక్రపాణి, వైనాల కుమార్ స్వామి, అబ్బు ప్రకాశ్ రెడ్డి, పోలేపల్లి శ్రీనివాస్ రెడ్డి, చిట్టి రెడ్డి రాజిరెడ్డి, మారెపల్లి కిట్టయ్య, మారేపల్లి రాజేందర్, వరదరాజు, మోత్కూరి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
