వరంగల్ వాయిస్, పరకాల : వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎన్నికల్లో తీన్మార్ మల్లన్నను అధిక మెజారిటీతో గెలిపించాలని కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి కోరారు. పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి ఆదేశానుసారం బుధవారం గీసుగొండ మండలం, 15,16వ డివిజన్ల పరిధిలోని మండల డివిజన్ల స్థాయి సన్నాహక సమావేశాన్ని మరియాపురం గ్రామంలోని నక్షత్ర ఫంక్షన్ హాల్ లో, సంగెం మండలం 17వ డివిజన్ స్థాయి సమావేశాన్ని సంగెం మండల కేంద్రంలోని గౌడ సంఘం కమ్యూనిటీ హాల్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా పరకాల నియోజకవర్గ ఇంచార్జి కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కో ఆర్డినేటర్ వొడితల ప్రణవ్, పరకాల మాజీ ఎమ్మెల్యే మొలుగూరి భిక్షపతి, ఎంపీపీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు, మండల పట్టణ డివిజన్ పార్టీ అధ్యక్షులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, సమన్వయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
