Warangalvoice

Tinmar Mallanna is assured of a huge majority

తీన్మార్ మల్లన్నకు భారీ మెజార్టీ ఖాయం

  • డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ

వరంగల్ వాయిస్, హనుమకొండ : కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వరంగల్ వెస్ట్ నియోజకవర్గ సమావేశం, హనుమకొండ ప్రెస్ క్లబ్ సమావేశానికి వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యుడు నాయిని రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న హాజరు కాగా, హనుమకొండ జిల్లా ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్ డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ పాల్గొన్నారు. రామకృష్ణ గారు మాట్లాడుతూ వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్లలో తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని, ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్క పట్టభద్రులకు డివిజన్ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, ప్రతి ఒక్కరికి అర్థం అయ్యే పద్ధతిలో చెప్పాలన్నారు. బ్యాలెట్ బాక్స్ లో రెండో నెంబర్ కాంగ్రెస్ పార్టీ పేరు ఉంటుందని, మల్లన్న పేరు ఉంటుందని, చెయ్యి గుర్తు ఉండదు కాబట్టి, అక్కడ ఒకటో నెంబర్ ను రాయాలని చెప్పాలని సూచించారు. మల్లన్నను గెలిపించుకుంటే ప్రభుత్వానికి వారధిగా మన సమస్యలు తీరుస్తారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉందని, కేంద్రంలో వచ్చేది కూడా కాంగ్రెస్ పార్టీయే కాబట్టి, అన్ని విధాలా కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్నను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు, జిల్లా ఎస్సీ డిపార్ట్మెంట్ జనరల్ సెక్రెటరీ ఎంవీ లాజరెస్, ఎస్సీ డిపార్ట్ మెంట్ సెక్రటరీ ఈర మహేందర్, మాతంగి రాజు, మహేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Tinmar Mallanna is assured of a huge majority
Tinmar Mallanna is assured of a huge majority

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *