వరంగల్ వాయిస్, కాజీపేట : దర్గా కాజీపేటలో ఉన్న తన ఇంటి సమీపంలో సోమవారం ఉదయం రోడ్డు పక్కన బండ మీద మీద పడబోయిన ఒక వ్యక్తిని కాపాడి తాను రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నమస్తే తెలంగాణ రచయిత, యూనివర్సిటీ అధ్యాపక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ బైరి నిరంజన్ కు ఎడమ చేయి మణికట్టు కీలు విరిగిపోయి బలమైన దెబ్బలు తగలి చికిత్స పొందుతున్న నేపథ్యంలో వారి పరిస్థితిని తెలుసుకొని ఫోన్ లో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. దీనికి వారు స్పందిస్తూ తారక రామారావు గొప్ప మానవతావాది అని ప్రమాదవశాత్తు కాలు విరిగి తాను తీవ్రమైన కాలు నొప్పితో బాధపడుతూ కూడా నాకు జరిగిన ప్రమాదాన్ని వెంటనే తెలుసుకొని నన్ను పలకరించడం నాకు ఎంతో భరోసాను ఇచ్చిందని బైరి నిరంజన్ తెలిపారు. ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి, యూనివర్సిటీ అధ్యాపక సంఘం చైర్మన్ డాక్టర్ పి.కరుణాకర్ రావు, నేతలు డాక్టర్ లింగయ్య, డాక్టర్ జితేందర్, డాక్టర్ ప్రవీణ్, డాక్టర్ సురేష్ , డాక్టర్ ఫిరోజ్ తదితర నాయకులు వారిని కలిసి పరామర్శించారు.
