వరంగల్ వాయిస్, రఘునాథపల్లి : హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారుల గల రఘునాథపల్లి, నిడిగొండ, గోవర్ధనగిరి, కొమ్మల గ్రామాల మధ్యలో ఇటీవల తరచుగా ప్రమాదాలు జరుగుతుండడంతో సిఐ శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. నేపథ్యంలో జనగామ రూరల్ సర్కిల్ ఇన్ స్పెక్టర్ శ్రీనివాస్ యాదవ్ నేపథ్యంలో రఘునాథపల్లి పోలీస్ స్టేషన్ సమీపంలో రోడ్డు ప్రమాదాల నివారణకై సూచిక బోర్డును ఏర్పాటు చేశారు. ఇటీవల మొబైల్ టిఫిన్ సెంటర్ వద్ద టిఫిన్ చేస్తున్న ముగ్గురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందడంతో పోలీసులు ప్రత్యేక దృష్టికి కేంద్రీకించారు. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి తో నిరంతరం తరచుగా వాహనాలను తనిఖీ చేస్తూ పలు పలు సూచనలు చేస్తున్నారు. డ్రంకెన్ డ్రైవ్ తో పాటు వాహనాలకు లైసెన్స్ లేని వారికి జరిమాన విధిస్తూ జైలుకు పంపిస్తున్నారు. లింగాల గణపురం, చిల్పూర్, రఘునాథ పెళ్లి మండలాల పరిధిలోగల గ్రామాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు.
