- డీఎంహెచ్ఓ డాక్టర్ అప్పయ్య
వరంగల్ వాయిస్, ములుగు : చిన్న పిల్లలకు టీకాలు ఇచ్చే కార్యక్రమంలో భాగంగా బుధవారం డీఎంహెచ్ఓ డాక్టర్ అప్పయ్య ములుగు మండలం రాయిని గూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని జంగాలపల్లి, కొత్తూరు, సర్వాపూర్ సబ్ సెంటర్ లతో పాటు రాయినిగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా చేశారు. మూడు ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాలలో దాదాపుగా 15 మంది పిల్లలకు టీకాలు ఇవ్వడం తనిఖీ చేశారు. దీంతో పాటు ప్రతి ఆశలకు, ఏఎన్ఎంలకు ముందుగా ప్రతి గర్భిణీ స్త్రీని నమోదు చేసి డెలివరీ అయ్యి నెలన్నర రోజులు వరకు తల్లి పిల్లలను చూసుకోవలసిన బాధ్యత మన ఆరోగ్య శాఖ సిబ్బందికి ఉందని తెలిపారు. అలాగే, మున్ముందు వర్షాకాలం ప్రారంభం కాబోతున్నందున కాలానుగుణంగా వచ్చే వ్యాధులు ప్రబలకుండా ఉండడానికి తీసుకోవలసిన జాగ్రత్తలపై ఆశలకు, ఏఎన్ఎంలకు తగు సూచనలు చేయడం జరిగింది. మార్గమధ్యలో బావి తీస్తున్న కూలీలు కనపడగా అది ఒంటిగంట సమయంలో ఆగి ఎండ తీవ్రత దానివల్ల వచ్చే వ్యాధుల గురించి అవగాహన కల్పించడమే కాకుండా వారికి ఓఆర్ఎస్ పాకెట్లు అందించి ఒక లీటర్ నీళ్లలో ఒక పాకెట్ కలిపి తాగాల్సిందిగా సూచించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్రవణ్ కుమార్, స్టాఫ్ నర్స్ మున్ని, ఏఎన్ఎంలు అల్లం సులోచన, అల్లం సుజాత, ఆశలు పాల్గొన్నారు.
