వరంగల్ వాయిస్, కాశిబుగ్గ : ఎంజీఎం రెండో గేటు ముందు గత 20 సంవత్సరాలుగా టీ కొట్టు నడిపిస్తూ వీధి వ్యాపారం నిర్వహణలో మొదటి స్థానం దక్కించుకున్న మహమ్మద్ మహబూబ్ పాషాని వరంగల్ రామన్నపేటలోని డాక్టర్ ఏ.రాజేంద్రప్రసాద్ భారతి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సోమవారం శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ట్రస్ట్రీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ఉద్యోగాలకోసం కాకుండా స్వయం కృషితో అభివృద్ది చెందాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్గనైజర్ శ్రవణ్, సాయి, శైలజ, శ్రీకాంత్ హోటల్ సిబ్బంది, స్థానికులు పాల్గొన్నారు.
