వరంగల్ వాయిస్, వరంగల్ : తెలంగాణ గవర్నమెంట్ ఫార్మసిస్ట్ అసోసియేషన్ వరంగల్, హనుమకొండ జిల్లా కమిటీల ఆధ్వర్యంలో ‘ప్రపంచ ఫార్మసిస్ట్ దినోత్సవం’ వేడుకలను వరంగల్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం రాష్ట్ర అధ్యక్షులు బత్తిని సుదర్శన్ గౌడ్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వరంగల్, హనుమకొండ జిల్లాల వైద్య ఆరోగ్యశాఖ అధికారులు డాక్టర్ లలితా దేవి, డాక్టర్ కె.వెంకటరమణ, డ్రగ్ ఇన్స్పెక్టర్ డాక్టర్ జన్ను కిరణ్ హాజరై ఫార్మసిస్టులను ఉద్దేశించి మాట్లాడుతూ వైద్య ఆరోగ్యశాఖలో ఫార్మసిస్టులు అతి కీలకమైన బాధ్యతలు నిర్వహిస్తున్నారన్నారు. ప్రభుత్వాలు ఫార్మసీ చట్టం 1948 సెక్షన్ 42 ఇంప్లిమెంట్ చేయాలని, డాక్టర్ ప్రెస్క్రిప్షన్ లేకుండా ఫార్మసిస్టులు పేషంట్స్ కు మందులు డిస్పెన్స్ చేయరాదని, వైద్యులు రాసిన ప్రెస్క్రిప్షన్ లో తప్పులు ఉంటే ధైర్యంగా ఎత్తి చూపాలని, కరోనా సమయంలో ఫార్మసిస్టులు చక్కగా విధులు నిర్వహించారని కొనియాడారు. సమస్యలన్నింటినీ తమ వంతుగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీజీపీఏ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కందకట్ల శరత్ బాబు, డాక్టర్ రాపోలు సత్య నారాయణ, ఉప్పు భాస్కర్ రావు, వరంగల్ జిల్లా అధ్యక్షులు సీహెచ్ ప్రేమ్ సాగర్, కార్యదర్శి ఎం.అవినాష్, హనుమకొండ జిల్లా కార్య దర్శి జి.సతీష్, ఫార్మసీ సూపర్ వైజర్ నాగమణి, నాయకులు నార్ల వేణు, సత్యం, సూరయ్య, శోభా రాణి, దేవంభట్ల ప్రకాష్ రావు, యాదయ్య, సుజాత, వెంకట్, సుధాకర్, సృజన, అజిత, విజయ లక్ష్మి, జాన్సీ లక్ష్మి, విజయ, శివ, అనిత, కుమార్, స్వరూప, అనూష, స్వాతి, సరలా రాణి, సుధా రాణి, శిరీష, మాధురి, సంతోష్, అనిల్, సతీష్, అంజి, రాకేష్, గోవర్ధన్, అనూష, నరేందర్, అరుణ కుమారి, రాజేశ్వరి, రజని, వెంకట స్వామి, దినేష్, ప్రభావతి తదితరులు పాల్గొన్నారు.
