వరంగల్ వాయిస్, చిట్యాల : మండలంలో ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం సందర్భంగా జుకల్ గ్రామంలో అధికారులతో కలిసి జడ్పీటీసీ గొర్రె సాగర్, మండల స్పెషల్ ఆఫీసర్ శైలజ ఎస్ఆర్ఎస్పీ కాలువ ఇరుపక్కలా మొక్కలు నాటారు. అనంతరం మన ఊరు మన బడి కార్యక్రమంలో కొత్తగా నిర్మింస్తున్న భవనాలను పరిశీలించారు. వారి వెంట పంచాయతీరాజ్ ఏఈ రవికుమార్, గ్రామ సర్పంచ్ పుట్టపాక మహేందర్, ప్రధానోపాధ్యాయులు చంద్రశేఖర్, జగదీష్, పంచాయతీ కార్యదర్శి దేవేందర్ రెడ్డి, టి.అపర్ణ, చిరంజీవి, గ్రామ సీనియర్ నాయకులు ఎండీ కాజా, గొడుగు రమేశ్, వర్క్ ఇన్ స్పెక్టర్ అంజి, గ్రామ యూత్ అధ్యక్షుడు సవోడ కిషన్, అవెంచ రమేష్, తదితరుల పాల్గొన్నారు
