ఒకరి ఒకరం.. ఆపదలో అందరం అంటూ బాసలు
వరంగల్ వాయిస్, హనుమకొండ : ఎక్కడో పుట్టి.. ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము.. చదువులమ్మ చెట్టు నీడలో అంటూ కలిసిమెలసి గడిపిన తమ బాల్య స్మృతులను 21 ఏళ్ల తర్వాత కలిసిన జడ్పీహెచ్ఎస్ 2002-03 బ్యాచ్ విద్యార్థులు గుర్తు చేసుకున్నారు. సంతోషంలో దుఖంలో అంతా ఒక్కటై ఒకరికి..ఒకరం తొడుంటామని ఉమ్మడిగా భరోసాను కల్పించుకున్నారు. ఇదంతా ఈనెల 19న కమలాపూర్ జడ్పీహెచ్ఎస్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం 2002-03 బ్యాచ్ గర్ల్స్ అండ్ బాయ్స్ కార్యక్రమంలో విద్యార్థులు తమ చిన్ననాటి సంగతులను గుర్తుకు చేసుకుంటూ చేసుకున్న బాసలు. చిన్ననాటి మిత్రులంతా 21 సంవత్సరాల తర్వాత కలుసుకోవడంతో వారి సంతోషం అంబరాన్నింటింది. అలాగే తమకు విద్యాదానం చేసిన గురువులను ఆహ్వానించి సత్కారాలు, బహుమతులు ప్రదానం చేసి వారిని ఘనంగా సన్మానించారు. ముందుగా అకాల మరణంతో తమకు దూరమైన తమ మిత్రులు, గురువులకు శ్రద్ధాంజలి ఘటించి ఒక నిమిషం మౌనం పాటించారు. అనంతరం బాల్యంలో తమ తరగతి గదిలో చేసిన అల్లరిని గుర్తు చేసుకుంటూ ఆప్యాయతలు, అనురాగాలు పంచుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జడ్పీహెచ్ఎస్ గర్ల్స్ స్కూల్ ప్రిన్సిపల్ రామ కృష్ణం రాజు, జడ్పీహెచ్ఎస్ బాయ్స్ స్కూల్ ప్రిన్సిపల్ మల్లికార్జున్ రావు పాల్గొన్నారు. డాన్స్ మాస్టర్ అర్జున్ టీం తమ డాన్స్ పొగ్రాంతో పూర్వ విద్యార్థులను ఉత్సాహపరిచారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన గురువులు, పూర్వ విద్యార్థులకు విందు భోజనం పెట్టిన పల్లపు సురేష్ కు ధన్యవాదాలు తెలియజేశారు. తమ బ్యాచ్ లోని పూర్వ విద్యార్థులకు ఆపద సమయాల్లో ఒకరికి ఒకరూ సహాయ సహకారాలు అందజేసుకుంటామని ఉమ్మడిగా ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో అలనాటి గురువులు మల్లయ్య, నారాయణ, నవీన్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, రాజమౌళి, హెడ్ వర్డ్, తిరుపతి, రాజేందర్, విజయ్ చందర్, నర్సింగ రావు, శ్రీనివాస రావు, పద్మ, వనజ, శ్రీదేవి, సురంభ, సూర్య భవాని, స్నేహలత, వెంకటరమణ, నీత, సుజాత, రవీంద్రనాథ్, అనిల్, నర్సింగ రావు (రిటైర్డ్ హెడ్ మాస్టర్) పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఆర్గనైజర్ టీం పుల్ల రమేష్, చిరంజీవి, విశ్వనాథ్, పుల్ల రాజేష్, శ్రీకాంత్, అశోక్, ఉమాదేవి, కరుణాదేవి, స్వామి, మధుకర్, విక్రమ్, సుమన్, సంపత్, శ్రీను, శ్రీలత, కరుణాదేవి, నర్మద, స్రవంతి, ఉమాదేవి తదితరులు పాల్గొన్నారు.