- హాజరైన ఎంపీలు అనిల్ యాదవ్, కడియం కావ్య ,ఎమ్మెల్యే నాయిని…
వరంగల్ వాయిస్ , హనుమకొండ : హనుమకొండ గోకుల్ నగర్ లో బంక సంపత్ యాదవ్ ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం ఏర్పాటు చేసిన సదర్ సమ్మేళన్ వేడుకల్లో ముఖ్య అతిథులుగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి,రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్,వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు కడియం కావ్య పాల్గొన్నారు..
మొదటి సారిగా వరంగల్ లో నిర్వహించడం ప్రత్యేకంగా ఉంది. : నాయిని రాజేందర్ రెడ్డి
సదర్ పండుగ అంటే హైదరాబాద్ గా పేరుగాంచిన వేడుక కానీ ఇప్పుడు వరంగల్ లో మొదటి సారిగా నిర్వహించడం ప్రత్యేకంగా ఉందని అభినందించారు.అసెంబ్లీ ఎన్నికల్లో యాదవ సోదరా సోదరిమనులు పార్టీలకు అతీతంగా గెలిపించారాని సదర్ వేదికగా కృతజ్ఞతలు తెలిపారు. రాజకీయంగా యాదవులకు సమూచితస్థానం కల్పించడం జరిగిందని అతి చిన్న వయసులో అనిల్ కుమార్ యాదవ్ ను రాజ్యసభకు పంపిన ఘనత కాంగ్రెస్ పార్టీదని గుర్తు చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిర్వహించిన సదర్ పండుగలో మొదటి సారి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారని, మరుసటిరోజే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సదర్ సమ్మేళన్ వేడుకను రాష్ట్ర పండుగగా ప్రకటించి జీవో విడుదల చేయడం పట్ల హనుమకొండ జిల్లా యాదవ సోదరుల పక్షాన కృతజ్ఞతలు తెలిపారు.గోకుల్ నగర్ వేదికగా ప్రారంభమైన సదర్ సమ్మేళన్ వేడుకను వచ్చే ఏడాదికి మరింత ఘనంగా నిర్వహించేలా నా వంతు సహాయ సహకారాలు అందిస్తానని ఎమ్మెల్యే నాయిని హామీ ఇచ్చారు.
సదర్ పండుగను అధికారికంగా గుర్తిస్తూ జీఓ జారీచేయడం ఆనందంగా ఉంది : ఎంపీ డా. కడియం కావ్య మాట్లాడుతూ
70, 80 సంవత్సరాల నుంచి సదర్ ను యాదవులు ఎంతో ఘనంగా నిర్వహిస్తూ వస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సదర్ పండుగను అధికారికంగా గుర్తిస్తూ జీఓ జారీ చేసారన్నారు. ఈ సదర్‌ను అన్ని వర్గాల ప్రజలు ఎంతో ఆదరిస్తున్నారని పేర్కొన్నారు. మొదటిసారి వరంగల్ లో ఈసదర్ ఉత్సవాలు జరుపుకోవడం, అందులో పాల్గొనందుకు చాలా ఆనందంగా ఉందన్నారు. రానున్న రోజుల్లో ఈ ఉత్సవాలను పెద్ద ఎత్తున జరుపుకుందాం అన్నారు. శ్రీ కృష్ణుని వారసులైన యాదవులు దీపావళి పండుగ తర్వాత ప్రతి సంవత్సరం ఈ సదర్ ను ఎంతో ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని వివరించారు. సదర్ ఉత్సవాల సందర్భంగా నిర్వహించే దున్నపోతుల విన్యాసాలను చూసేందుకు అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున వస్తారని తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ కడియం కావ్య ని నిర్వహకులు శాలువాతో ఘనంగా సన్మానించి మెమెంటో లను అందజేశారు.ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు మామిండ్ల రాజు యాదవ్,జక్కుల రవీందర్ యాదవ్,బొంగు అశోక్ యాదవ్, మాజీ కూడా చైర్మన్ సుందర్ రాజు యాదవ్, షైన్ విద్యాసంస్థల చైర్మన్ కుమార్ యాదవ్,బంక సంపత్ యాదవ్,బంక రాజు యాదవ్,గోకుల్ సదర్ సమ్మేళనం కమిటీ సభ్యులు,యాదవ నాయకులు,కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.