వరంగల్ వాయిస్, కాశిబుగ్గ : వరంగల్ తూర్పు కాశిబుగ్గ చౌరస్తాలో గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ మేయర్ గుండు సుధారాణి జన్మదినం సందర్భంగా టీఆర్ఎస్ నాయకులు ఆకెన వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీఆర్ఎస్ నాయకుడు యూత్ గుండు విజయరాజ్ పాల్గొన్నారు. ఈ సందర్భముగా ఆకెన వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఇలాంటి పుట్టిన రోజులు ఎన్నో జరుపుకోవాలని, రాజకీయ రంగంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. గుండు విజయరాజ్ తో కేకు కట్ చేసి, పండ్ల పంపిణీతో పాటు, గులాబీ మొక్కలను పంపిణి చేశారు. కాశిబుగ్గలోని మదర్ ధెరిస్సా అనాధ ఆశ్రమంలో అనాధలకు అన్నదానం చేశారు. మేయర్ ఛాంబర్ లో గుండు సుధారాణి కలుసుకొని పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతో శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమములో టీఆర్ఎస్ నాయకులు పెరుమాండ్ల లక్ష్మణ్, మామిడాల సురేందర్, విరాటి ప్రకాష్ రెడ్డి, గంజి సాంబయ్య, సాంబారి సాయన్న, మార్గం ఎల్లయ్య, సామల లక్ష్మీనారాయణ, కటకం విజయ్, కుడికాలు కిషన్, చిలుపూరి మల్లేశం, బ్రహ్మచారి పాల్గొన్నారు.
