- పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి
వరంగల్ వాయిస్,పెద్దపల్లి: రైతు సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తున్నదని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి పేర్కొన్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను మరింత బలోపేతం చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని తెలిపారు. రైతు సంక్షేమం కోసమే తెలంగాణ ప్రభుత్వం పని చేస్తున్నదని, అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ఘనత తెలంగాణ రాష్టాన్రికే దక్కిందని పేర్కొన్నారు. రైతు సమస్యలను పరిష్కరించడంతోపాటు గోదాంల నిర్మాణం,తదితర అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టినట్లు చెప్పారు. గ్రామాల్లో ఎటు చూసినా పచ్చదనంతో ఉండేలా చెట్లను పెంచుకోవాలనీ, పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని మనోహర్‌రెడ్డి సూచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రామాలాభివృద్ధి కోసం ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టర్‌ను కొనుగోలు చేసే కార్యక్రమం చేపట్టారని తెలిపారు. గ్రామాల్లో పారిశుధ్యం, పచ్చదనం పెంపొందిం చేందుకు హరితహారంలో నాటిన మొక్కలను సంరక్షించు కునేందుకు ట్రాక్టర్లను వినియోగించాలన్నారు. గ్రామాల్లో చెత్తను డంపింగ్ యార్డులకు తరలించేందుకు ట్రాక్టర్లను వాడుతూ పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధతో గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, ప్రజాప్రతినిధులంతా సమన్వయంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కరోనా నేపథ్యంలో గ్రామాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూనే తమ వీధులను శుభ్రంగా ఉంచు కోవాలన్నారు.
