వరంగల్ వాయిస్, కాజీపేట : గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కాజీపేట పట్టణం, 63వ డివిజన్ బాపూజీ నగర్ కూరగాయల మార్కెట్ పరిధిలో నూతనంగా ఏర్పడిన బృందావన్ కాలనీవాసులు బుధవారం గ్రానైట్ లోడుతో వెళ్తున్న లారీలను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ ఈ గ్రానైట్ క్వారీలను నడుపుతున్న నాలుగు క్వారీ యజమానుల మీద ప్రస్తుత కాజీపేట సీఐకి ఫిర్యాదు చేశామన్నారు. గ్రానైట్ క్వారీ ఓనర్లు ఇష్టారాజ్యంగా గ్రానైట్ లోడ్ తో లారీలను కాలనీలో నడిపిస్తున్నారని, గతంలో కాజీపేట సీఐగా పనిచేసిన మహేందర్ రెడ్డి, రాజులకు పిటిషన్లు ఇవ్వగా, నాలుగు క్వారీల యజమానులు వచ్చి కాలనీవాసులను సమయం అడగగా కాలనీవాసులు ఒప్పుకోలేదన్నారు. అలాగే గతంలో మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ కు తెలియపరచగా ఆయన కాలనీకి వచ్చి అప్పటి స్థానిక సీఐ, ఏసీపీ, తహసీల్దార్, ఆర్డీవో, జాయింట్ కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ మైనింగ్ ఏడీలను పిలిపించి గ్రానైట్ లారీలు పోకుండా ఆపివేయమని చెప్పించారు. అప్పుడు, క్వారీ యజమానులు ఆరు నెలల గడువు అడగగా 100 రూపాయల బాండ్ కాగితంపై నాలుగు క్వారీ యజమానుల సంతకం తీసుకొని ఆరు నెలల గడువు ఇచ్చామని తెలిపారన్నారు. గడువు ప్రకారం ముగ్గురు క్వారీ యజమానులు లారీలు బందు పెట్టారని, మరో క్వారీ యజమాని పల్లపు వెంకటస్వామి లారీలు నడుపుతూనే ఉన్నాడని మండిపడ్డారు. దీనిపై కాజీపేట సీఐ వెంటనే స్పందించి క్వారీ యజమానిపై చట్టరీత్యా చర్యలు తీసుకోగలరని తెలిపారన్నారు. లారీలను అడ్డుకుని, పిటిషన్ ఇచ్చిన వారిలో బృందావన్ కాలనీ అధ్యక్షుడరాలు బర్ల సరోజ, ప్రధాన కార్యదర్శి మద్దెల భనయ్య, ఉపేంద్ర, విజయ, ఉమా, కరుణ, సకిన, భారతమ్మ, పద్మ, రాజయ్య, జగదీశ్వర్, షాకీర్, వీరమల్లు, బుచ్చిరెడ్డి, సత్యనారాయణ భాష కాలనీవాసులు ఉన్నారు.
