వరంగల్ వాయిస్, రఘునాథపల్లి : మండలంలోని గోవర్ధనగిరి గ్రామంలో గల దర్గా సమీపంలో గురువారం ఉదయం యువకుడు చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం ప్రకారం భూపాలపల్లి మండలం నేరేడుపల్లి గ్రామానికి చెందిన బర్ల హరీష్ (35)అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మృతదేవాన్ని జనగామ ఏరియా హాస్పిటల్ కు తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నరేష్ తెలిపారు.
