Warangalvoice

Salutations to the teachers

గురువులకి వందనం

  • ఉపాధ్యాయులకు మంత్రి సురేఖ శుభాకాంక్షలు

(వరంగల్ వాయిస్, వరంగల్): విద్యార్థికి దశ, దిశను చూపించే గురువు పాత్ర సమాజంలో అత్యున్నతమైనదని అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖామాత్యులు కొండా సురేఖ అన్నారు. సెప్టెంబర్ 5 ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా మంత్రి సురేఖ ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలిపారు. చదువు మాత్రమే అన్ని రకాల అణచివేతలు, నిర్బంధాల నుంచి స్వేచ్ఛను ప్రసాదిస్తుందని మంత్రి అన్నారు. విద్యార్థులను అత్యుత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులదే కీలక పాత్ర అన్నారు. అలాంటి విద్యను అందించడంలో నిమగ్నమైన ఉపాధ్యాయులందరూ స్ఫూర్తి ప్రదాతలుగా నిలుస్తారని మంత్రి పేర్కొన్నారు. ఒక సమర్థుడైన గురువుకు మాత్రమే దేశగమనాన్ని మార్చగల శక్తి ఉంటుందన్నారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం విద్యారంగంలో అత్యున్నత ప్రమాణాలను నెలకొల్పేందుకు గాను విద్యా కమిషన్ ఏర్పాటు చేసిన విషయాన్ని మంత్రి సురేఖ గుర్తు చేశారు. ఈ కమిషన్ పనితీరుతో రాష్ట్ర విద్యారంగం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని మంత్రి సురేఖ ఆశాభావం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *