- వాంతులు, విరోచనాలతో ఆస్పత్రికి
- మహబూబాబాద్ జిల్లా గూడూరులో ఘటన
వరంగల్ వాయిస్, మహబూబాబాద్ : మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం దామరవంచ గురుకుల పాఠశాలలో శుక్రవారం ఫుడ్ పాయిజన్ అయింది. దీంతో పలువురు విద్యార్థులకు కడుపునొప్పి రావడంతోపాటు వాంతులు, విరోచనాలతో అస్వస్థతకు గురయ్యారు. ఇందులో 9వ తరగతి చదువుతున్న జి.సాయి ప్రసాద్, 7వ తరగతి చదువుతున్న బి.యాకుబ్, ఎల్.రాహుల్ సీరియస్ కావడంతో హుటాహుటిన గూడూరు ఏరియా హాస్పటల్ తరలించారు. వారికి మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు. మిగిళిన గురుకుల విద్యార్థులు స్వల్ప అస్వస్థతకు గురైనప్పటికీ ఎలాంటి ప్రమాదం లేదని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.