- కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణా రెడ్డి
వరంగల్ వాయిస్, వరంగల్ : తూర్పు నియోజకవర్గంలో వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఉపఎన్నిక సందర్బంగా గురువారం వరంగల్ ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల ఇంచార్జి కామారెడ్డి శాసనసభ్యుడు కాటిపల్లి వెంకటరమణా రెడ్డితో కలిసి వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంటా రవికుమార్ వరంగల్ ఎల్ఐసీ మెయిన్ బ్రాంచ్, ఎంజీఎం ఎదురుగా గల ఎల్ఐ సీ బ్రాంచ్, పలు విద్యా సంస్థలు, పలు ప్రభుత్వ కార్యాలయంలో ఉద్యోగులను కలసి వారితో ముచ్చటించారు. నిరుద్యోగులను మోసం చేసిందని గత ప్రభుత్వ బీఆర్ఎస్ ను, ఇప్పుడు దొంగ హామీలతో వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎవరూ నమ్మడం లేదని దుయ్యబట్టారు. వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డికి మొదటి (1) ప్రాధాన్యత ఓటు వేయాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో వరంగల్ తూర్పు ఎమ్మెల్సీ ఎన్నికల ఇంచార్జి పీఎల్ శ్రీనివాస్, గంగిడి కృష్ణారెడ్డి, మాజీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎర్రబెల్లి ప్రదీప్ రావు, కుసుమ సతీష్, రత్నం సతీష్ షా, ఓబీసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బైరీ మురళీకృష్ణ, బీజేపీ సీనియర్ నాయకులు సముద్రాల పరమేశ్వర్, జిల్లా ఉపాధ్యక్షులు కనుకుంట్ల రంజిత్ కుమార్, ఏరుకుల రఘున రెడ్డి, జిల్లా కార్యదర్శి గడల కుమార్, వరంగల్ జిల్లా ఎస్పీ మోర్చా కన్వీనర్ మార్టిన్ లూథర్, ఓబీసీ జిల్లా అధ్యక్షులు కందిమల మహేష్, ఉపాధ్యక్షులు గోకే వెంకటేష్, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు భరత్ వీర్, జిల్లా నాయకులు కూచన క్రాంతి కుమార్, నాయకులు పాల్గొన్నారు.
