వరంగల్ వాయిస్, ఆత్మకూర్ : మండలంలోని కటాక్షపూర్ గ్రామంలో బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గెలుపు కోసం పట్టభద్రులను బీజేపీ నాయకులు కలిసి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షుడు సదానందం మాట్లాడుతూ కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న పెద్ద బ్లాక్ మెయిలర్, మల్లన్నకు గత ఎన్నికల్లో ఉన్న సానుభూతి ఇప్పుడు లేదన్నారు. అతడు ఒక అవకాశవాదని పట్టభద్రులు మొహమాటం లేకుండా చెబుతున్నారని అన్నారు. ప్రేమేందర్ రెడ్డిని గెలిపిస్తామని మాట ఇస్తున్నారని తెలిపారు. మోసపోయి గోసపడ వద్దని, పట్టభద్రుల ఎమ్మెల్సీ ప్రతిపక్ష నాయకుడైతే ప్రజల తరఫున, నిరుద్యోగ సమస్యలపై శాసనమండలిలో అధికార పార్టీని నిలదీసి అడిగే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మాజీ మండల అధ్యక్షుడు ఇర్సడ్ల సదానందం, బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి, మండల ఎమ్మెల్సీ బూత్ ఇంచార్జి ఉప్పుగళ్ల శ్రీకాంత్ రెడ్డి, మాజీ మండల ప్రధాన కార్యదర్శి బొల్లెపల్లి రాజు, ఎండీ నజీర్, వినయ్, జయరామ్, సందీప్, గణేష్, అభి పాల్గొన్నారు.
