- శోకసంద్రంలో తల్లిదండ్రులు
వరంగల్ వాయిస్, చెన్నారావుపేట : చెన్నారావుపేట మండలం జల్లి గ్రామంలోని పింగిలి రజనీకర్ రెడ్డి-నవత ఏకైక కుమారుడు పింగిలి అశ్వంత్ రెడ్డి నర్సంపేట డివిజన్ లోని మదర్స్ ల్యాండ్ స్కూల్ లో 10వ తరగతి చదువుతున్నాడు. ఈనెల 21న జరిగే పరీక్షలకు హాజరు కావాల్సిన అశ్వంత్ రెడ్డికి బుధవారం ఉదయం 10 గంటల సమయంలో గుండెపోటు రావడంతో హాస్పిటల్ కు తరలించారు. వైద్య చికిత్స పొందుతూ మరణించాడు. కొడుకు మరణాన్ని తట్టుకోలేక తల్లి, దండ్రులు గుండెలు అవిసేలా విలపించారు. కొడుకుకు జిల్లేడు చెట్టుతో పెళ్లి చేసి, పాడెకట్టి, తల కొరివిపెట్టిన తీరును చూసి గ్రామస్తులందరూ కంటతడి పెట్టారు.