వైఎస్ఆర్ టీపీ జిల్లా అధ్యక్షుడు అప్పం కిషన్
వరంగల్ వాయిస్, భూపాలపల్లి : జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సంక్షేమ శాఖ ఆశ్రమ ఉన్నత బాలికల హాస్టల్, జిల్లా ఎస్ఎంహెచ్ హాస్టల్లో ఉన్న సమస్యల పై గురువారం హాస్టల్ ను వైఎస్ఆర్ టీపీ జిల్లా అధ్యక్షుడు అప్పం కిషన్ సందర్శించారు. అనంతరం హాస్టల్లోని విద్యార్థులు అక్కడ జరుగుతున్న ఇబ్బందులను ఆయనకు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాల్సిన పూర్తి స్థాయి మెనూ విధానాన్ని అమలు చేయడం లేదని, నాసిరకంగా బియ్యం, పప్పులు, నూనె, కూరగాయలు ఉన్నాయని, భోజనంలో పురుగులు వస్తున్నాయని, భోజనం నాణ్యత ఉండట్లేదని, పర్మినెంట్ మహిళ వార్డులను, టీచర్లని నియమించాలని విద్యార్థులు చెప్పారు. నిన్న కొంతమంది హాస్టల్ విద్యార్థుల తల్లిదండ్రులు కిషన్ ను కలిసి హాస్టల్ సమస్యలు తెలియజేశారని, విద్యార్థుల తల్లిదండ్రులు హాస్టల్ సిబ్బందితో మాట్లాడితే సిబ్బంది అమర్యాదగా, ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని తల్లిదండ్రులు వాపోయారని తమ పిల్లలు హాస్టల్లో ఉండలేమని పలుమార్లు తల్లిదండ్రులకు ఫోన్ లో చెబుతూ కన్నీరు మున్నీరు పెట్టుకుంటున్నారని తెలిపారు. జిల్లాలో ఉన్న అన్ని హాస్టలపై జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టి పెట్టాలని, వారి సమస్యలు వెంటనే పరిష్కరించాలని. దీనికి ప్రత్యేక కమిటీని వేయాలని, పిల్లల ఆహారంపై నిర్లక్ష్యం వహిస్తున్న సిబ్బందిని వెంటనే విధుల నుంచి సస్పెండ్ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు రజిత, వనమల, రమేష్, రాజు, శ్రీనివాస్, మౌనిక, స్వప్న పాల్గొన్నారు.
పలు సంక్షేమ హాస్టల్ లో అమలు కాని మెనూపై జిల్లా కలెక్టర్ దృష్టి పెట్టాలని కోరారు.
