Warangalvoice

Political objective behind the change of governor?

గవర్నర్‌ మార్పు వెనక రాజకీయ లక్ష్యం ?

  • జగన్‌ నిర్ణయాలకు చెక్క పెట్టే ఉద్దేశ్యం
  • ఎపిలో పాగా వేయాలన్న వ్యూహంలో భాగమా

వరంగల్ వాయిస్,అమరావతి: ఎపిలో అధికారం కోసం అర్రులు చాస్తున్న బిజెపి మెల్లగా జగన్‌కు చెక్‌ పెట్టే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ క్రమంలోనే గవర్నర్‌ మార్పు అన్న చర్చ జరుగుతోంది. అనూహ్యంగా ఎపికి కొత్త గవర్నర్‌గా మాజీ సుప్రీం న్యాయమూర్తిని నియమించడం ద్వారా జగన్‌కు హెచ్చరికలు పంపారా అన్న చర్చకూడా సాగుతోంది. గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ను ఆకస్మికంగా మార్చి.. ఆయన స్థానంలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ను నియమించడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తెలంగాణలో లాగా ఎపిలోనూ దూకుడుగా వ్యవహరించే గవర్నర్‌ ఉండాలని బిజెపి అధిష్లానం యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది.జగన్‌ ప్రభుత్వ అనాలోచిత విధానాలు, పోకడలను అడ్డుకోవాల్సిన ఆవశ్యకతను కేంద్రం గుర్తించిందా అన్న సందేహం తాజా నియామకం ద్వారా వ్యక్తమవుతోంది. ఇలాంటి దూకుడుకు చెక్‌పెట్టడానికే జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ను గవర్నర్‌గా నియమించారని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఎప్పుడూ వివాదాల జోలికిపోని జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ అవసరమైనప్పుడు చాలా గట్టిగా వ్యవహరిస్తారని, ఒత్తిళ్లకు లొంగరని న్యాయవర్గాలు అంటున్నాయి. ఈయన ద్వారా జగన్‌కు చెక్‌ పెట్టవచ్చని, మరీ అడ్డగోలుగా వ్యవహరించకుండా నిలువరించవచ్చనే ఆలోచనతోనే గవర్నర్‌గా ఎంచుకున్నారని చెబుతున్నారు. తెలంగాణలో గవర్నర్‌ తమిళిసై అక్కడి ప్రభుత్వానికి కంట్లో నలుసులా మారారు. కేంద్రం ఇప్పటికైతే జగన్‌రెడ్డి ప్రభుత్వంతో కొంత మేర సత్సంబంధాలనే కొనసాగిస్తోంది. కొన్ని విషయాల్లో మాత్రం ఆచితూచి అడుగు వేస్తున్నట్లు కనిపిస్తోంది. గత ఏడాది వరకు అడగడమే ఆలస్యం.. అదనపు అప్పులకు అనుమతి ఇచ్చేది. ఇప్పుడు కాస్త తగ్గించింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై బీజేపీ నేతల స్వరం కూడా క్రమంగా మారుతూ వస్తోంది. కొందరు కేంద్ర మంత్రులు రాష్ట్ర పర్యటనకు వచ్చి జగన్‌ ప్రభుత్వ వైఖరిని, విధానాలను ఘాటుగానే విమర్శిస్తు న్నారు. ఈ క్రమంలో ఎపిలో పాగా వేయాలనుకుంటున్న క్రమంలో గట్టి గవర్నర్‌ అవసరమన్న ఆలోచన చేశారా అన్న చర్చ కూడా సాగుతోంది. 2019 జూలై 24న విశ్వభూషణ్‌ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఇప్పటి వరకు జగన్‌ ప్రభుత్వంతో విభేదాలకు వెళ్లలేదు. ప్రభుత్వం నుంచి ఏ ్గªలు వచ్చినా దానివిూద పెద్దగా ప్రశ్నించేవారు కాదు. సర్కారుకు అనుకూల నిర్ణయాలు తీసుకుంటూ పూర్తి సానుకూలత ప్రదర్శించారు. జగన్‌ ప్రభుత్వంతో గవర్నర్‌ పూర్తిస్థాయిలో మమేకమైనట్లు కేంద్రం కూడా గుర్తించింది. కొందరు ఢిల్లీ పెద్దలు ఈ వైఖరిని తప్పుపడుతున్నట్లు తెలుస్తోంది. ఇవన్నీ ఒక ఎత్తయితే.. జగన్‌ సర్కారు చట్టవ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నా.. మూడు రాజధానులు సహా అత్యంత వివాదాస్పద మైన చట్టాలు చేసినా మరో మాటకు ఆస్కారమివ్వకుండా గవర్నర్‌ విశ్వభూషణ్‌ ఆమోదముద్ర వేయడంపై ఢిల్లీ పెద్దలు అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. దానికి తాజా ఘటనే ఉదాహరణగా విశ్లేషకులు పేర్కొంటున్నారు. రాజధాని ఏర్పాటుకు సంబంధించి రాష్టాల్రకు ఉన్న అధికారాలను పార్లమెంటులో ప్రస్తావించినప్పుడు.. ఆ ప్రశ్నతో నేరుగా సంబంధం లేకపోయినా.. జగన్‌రెడ్డి మూడు రాజధానుల చట్టంపై తమతో చర్చించలేదని, తమకు సమాచారం కూడా ఇవ్వలేదని కేంద్రం కొద్దిరోజుల కిందట ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. మూడు రాజధానుల బిల్లును విశ్వభూషణ్‌ కళ్లుమూసుకుని ఆమోదించారన్న ఆరోపణలు మొదటి నుంచీ ఉన్నాయి. అనేక బిల్లులను గవర్నర్‌ న్యాయపరిశీలన కోరకుండానే ఆమోదించారన్న రాజకీయ విమర్శలూ ఉన్నాయి. ఈ క్రమంలో ఎపిలోనూ తమిళసై లాంటి గవర్నర్‌ను నియమించారన్న ప్రచారం సగుతోంది.

Political objective behind the change of governor?
Political objective behind the change of governor?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *