వరంగల్ వాయిస్ ఖైరతాబాద్: హైదరాబాద్ లోని అతిపెద్ద గణపతి విగ్రమైన ఖైరతాబాద్ వినాయకుడికి పద్మశాలి కులస్తులు శనివారం వినాయక చవితి సందర్భంగా వస్త్రం, జంజం, గరిక మాల సమర్పించి ఘనంగా పూజలు నిర్వహించారు. ప్రతి సంవత్సరం వినాయకుడికి పద్మశాలి కులస్తులు వస్త్రం, జంజం, గరికమాల సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది. అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా ఖైరతాబాద్ వినాయకుడికి పద్మశాలి కులస్తులు వాటిని అందించడం జరిగింది. తెలంగాణలోనే అతిపెద్ద వినాయకుడిగా పేరుగాంచిన ఖైరతాబాద్ వినాయకుడికి పద్మశాలీలు వస్త్రం, జంజం, గరిక మాల సమర్పించే అవకాశం ఈసారి తమకు రావడం సంతోషంగా ఉందని తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల కమిషనర్, ఐఏఎస్ ఆఫీసర్ పార్థసారథి, ఐపీఎస్ అధికారి రావిరాల వెంకటేశం ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలిండియా వీవవర్స్ ఫెడరేషన్ సంఘం సభ్యులు గడ్డం వెంకటేశ్వర్లు, బసపత్తిని రాజేశం, రిటైర్డ్ సీనియర్ ఐఏఎస్ అధికారి టి.చిరంజీవులు, ఆర్పీ ఎస్ నేత గంజి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
