వరంగల్ వాయిస్, తొర్రూరు : మండల కేంద్రంలోని వివిధ గ్రామాలకు చెందిన రైతులు తొలకరి చినుకులతో ఆనందంతో తమకున్న భూములను ఈ ఖరీఫ్ సీజన్ లో దుక్కులు దున్నుకొని విత్తనాలు చల్లుకోవడం కోసం భూములను సిద్ధం చేసుకుంటున్నారు. కొన్ని చోట్ల రైతులు దుక్కులు దున్ని పత్తి, మిరప, ఇతరత్రా పంటలకు సంబంధించిన విత్తనాలను వ్యవసాయ కూలీలతో విత్తించడం జరుగుతుంది.
