Warangalvoice

Former Union Minister Sharad Yadav passed away

కేంద్ర మాజీమంత్రి శరద్‌ యాదవ్‌ కన్నుమూత

  • సంతాపం తెలిపిన ప్రధాని మోడీ తదితరులు
  • తెలంగాణ ఉద్యమానికి మద్దతు తెలిపారన్న కెసిఆర్‌

వరంగల్ వాయిస్,పాట్నా: మాజీ కేంద్ర మంత్రి శరద్‌ యాదవ్‌ (75) గురువారం రాత్రి కన్ను మూశారు. వయోభారంతో బాధ పడుతున్న శరద్‌ యాదవ్‌ను చికిత్స కోసం ఆయన కుటుంబ సభ్యులు గుర్‌గ్రామ్‌లోని ఫొర్టిస్‌ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తు న్నారు. ఆయన పరిస్థితి విషమించడంతో మరణించి నట్లు కూతురు సుభాషిణి శరద్‌ యాదవ్‌ ట్విట్టర్‌ వేదికగా తెలిపారు. జనతాదళ్‌ యునైటెడ్‌ వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉన్న శరద్‌ యాదవ్‌ ఏడుసార్లు లోక్‌సభకు, మూడుసార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2018లో లోక్‌ తాంత్రిక్‌ జనతాదళ్‌ పార్టీని స్థాపించారు. 1947 జూలై 1న మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలో శరద్‌ యాదవ్‌ జన్మించారు. బీహార్‌లో ఆర్జేడీ చీఫ్‌ లాలూ ప్రసాద్‌ యాదవ్‌, బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ తదితరులతో కలిసి పని చేసిన అనుభవం ఉంది. 1989కి ముందు విశ్వనాథ్‌ ప్రతాప్‌ సింగ్‌ స్థాపించిన జనతాదళ్‌ పార్టీలో కీలకంగా వ్యవహరించారు. గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న శరద్‌ యాదవ్‌ నిన్న తీవ్ర అస్వస్థతకు గురియ్యారు. దీంతో ఆయనను గురుగ్రామ్‌లోని ఓ ఆసుపత్రి ఎమ్జ్గంªన్సీ వార్డులో చేర్పించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు ఆయన. ’ఆసుపత్రికి తీసుకొచ్చేసరికే ఆయన అపస్మార స్థితిలో ఉన్నారు. పల్స్‌ లేదు. తొలుత సీపీఆర్‌ ప్రయత్నించి చూశారు. ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని.. ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. మధ్యప్రదేశ్‌లోని హోషంగాబాద్‌ జిల్లాలో 1947 జులై 1న జన్మించిన శరద్‌ యాదవ్‌ రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగారు. 1974లో జబల్‌పూర్‌ ఉప ఎన్నికల్లో పోటీ చేయాల్సిందిగా అప్పటి రాజకీయాల్లో సంచలన నేతగా పేరున్న జయప్రకాశ్‌ నారాయణ్‌ 27 ఏళ్ల యువకుడైన శరద్‌ యాదవ్‌కి సూచించారు. జయప్రకాశ్‌ నారాయణ్‌ అప్పగించిన ఆ బాధ్యతలను విజయవంతంగా నిర్వర్తించిన శరద్‌ యాదవ్‌.. ఆ ఎన్నికల్లో గెలుపొంది తొలి పోటీలోనే విజయం అందుకున్నారు. అది మొదలు శరద్‌ యాదవ్‌ రాజకీయ ప్రస్థానంలో ఎన్నో విజయాలు వరించాయి. 1999 నుంచి 2004 మధ్య వాజ్‌పేయూ ప్రభుత్వంలో శరద్‌ యాదవ్‌ పలు మంత్రిత్వ శాఖలు నిర్వహించారు. 2003లో జనతాదళ్‌ యునైటెడ్‌ జాతీయ అధ్యక్షుడ య్యారు. తన రాజకీయ ప్రస్థానంలో 2017లో బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ బీజేపీతో చేతులు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో ఆయనతో విభేదించి జేడీయూ నుంచి బయటకొచ్చారు. 2018లో లోక్‌తంత్రిక్‌ జనతాదళ్‌ పార్టీ ఏర్పాటు చేశారు. అయితే 2022 మార్చిలో ఆర్జేడీలో విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రతిపక్షాలను ఏకం చేయడంలో ఇది తొలి అడుగని శరద్‌ యాదవ్‌ తెలిపారు. శరద్‌ యాదవ్‌ మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం తెలిపారు. ఈ మేరకు ప్రధాని ట్వీట్‌చేశారు. ’శరద్‌యాదవ్‌ ఈ లోకాన్ని విడిచి వెళ్లడం చాలా బాధాకరం అన్నారు. ప్రజాజీవితంలో సుధీర్ఘ కాలంపాటు మంత్రిగా, ఎంపీగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారన్నారు. డా.లోహియా ఆలోచనలతో ఎంతో స్ఫూర్తివంతంగా నిలిచారని.. ఆయన కుటుంబ సభ్యులకు నా సానుభూతి అంటూ ప్రధాని మోదీ ట్వీట్‌ చేశారు. శరద్‌ యాదవ్‌ మరణం పట్ల కాంగ్రెస్‌ అగ్రనేతలు సోనియాగాంధీ,రాహుల్‌ గాందీ,మల్లికార్జున ఖర్గే సహా లెఫ్ట్నేతలు ఏచూరి,రాజా తదితరులు సంతాపం ప్రకటించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు కూడా సంతాపం ప్రకటించారు. తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమానికి శరద్‌ యాదవ్‌ అందించిన మద్దతు ను సీఎం కేసీఆర్‌ ఈ సందర్భంగా స్మరించుకున్నారు. వారి కుటుంబ సభ్యులకు సీఎం తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. శరద్‌
యాదవ్‌ మరణం రాజకీయాల్లో తీరని లోటు అని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌.అన్నారు. ఆయన మృతికి ఎంపీ బండి సంజయ్‌ కుమార్‌ సంతాపం తెలిపారు. సోషల్‌ విూడియా వేదికగా పలుమార్లు లోక్‌సభ, రాజ్యసభ సభ్యునిగా, కేంద్ర మంత్రిగా శరద్‌ యాదవ్‌ అందించిన సేవలను స్మరించుకున్నారు. శరద్‌ యాదవ్‌ కుటుంబ సభ్యులకు బండి సంజయ్‌ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

Former Union Minister Sharad Yadav passed away
Former Union Minister Sharad Yadav passed away

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *