వరంగల్ వాయిస్, వర్ధన్నపేట : భారతీయ జనతా పార్టీ వర్ధన్నపేట అధ్యక్షుడు రాయపురపు కుమారస్వామి ఆధ్వర్యంలో స్థానిక మండల అభివృద్ధి అధికారి రాజ్యలక్ష్మి, మండల పంచాయతీ అధికారి ధనలక్ష్మి కిసమాచార హక్కు చట్టం ద్వారా మండల పరిషత్, మండలంలోని అన్ని గ్రామాలకు సంబంధించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధుల కేటాయింపు వినియోగానికి సంబంధించిన సమాచారం కోసం దరఖాస్తు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పక్షాన మాజీ శాసనసభ్యుడు నల్లూరి ఇంద్రసేనారెడ్డి జాతీయ కార్యవర్గ సభ్యులు, తెలంగాణ రాష్ట్రంలోని అన్ని మండలాలలో ఆయా మండల పరిధిలో గల గ్రామాలకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 2014-15వ ఆర్థిక సంవత్సరం నుంచి జూన్ 30 2022 ఆర్థిక సంవత్సరం వరకు ఏమేం నిధులు కేటాయించాయి, వాటి వినియోగం ఏ విధంగా జరిగింది అనే అంశాలను ప్రాతిపదికన సమాచార సేకరణ కోసం ప్రతి మండలానికి ఈ దరఖాస్తులు పంపించడం జరిగిందన్నారు. అంతేకాకుండా వర్ధన్నపేట మండలానికి సంబంధించిన అన్ని గ్రామాలకు అక్కడి పంచాయతీ కార్యదర్శులకు ఆయా గ్రామాలకు కేటాయించబడిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులు, వాటి వినియోగం గురించిన పూర్తి సమాచారాన్ని ఇవ్వవలసిందిగా దరఖాస్తు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వీరితోపాటు ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పంజా వెంకటేశ్వర్లు, జిల్లా ఉపాధ్యక్షుడు న్యాలం సాయిలు, సిద్దం శ్రీనివాస్, కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు కర్క సోమిరెడ్డి, యువమోర్చా మండల అధ్యక్షుడు చెంగల సురేష్, శక్తి కేంద్రం ఇంఛార్జ్ దాడి రాజు, పట్టణ ప్రధాన కార్యదర్శి మల్లెపాక అనిల్, బీజేపీ నాయకుడు నరేందర్, మండల యువమోర్చా ఉపాధ్యక్షులు పెందోట మహాంత్, అనిమిరెడ్డి దినేష్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.
