- అభివృద్దికి నమూనా తెలంగాణ
- బిజెపి విమర్శలను తిప్పికొట్టాల్సిందే: వేముల
వరంగల్ వాయిస్,నిజామాబాద్: సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, చేసిన అభివృద్ధి పనులతో ప్రజలు బీఆర్‌ఎస్ పార్టీకి పట్టం కడతారని, మరోమారు తెలంగాణలో ఎగిరేది గులాబీ జెండానేనని మంత్రి వేముల ప్రశాంతరెడ్డి అన్నారు. తెలంగాణతో పాటు, దేశంలోనూ బిజెపికి ప్రజలు వాతలు పెటట్డం ఖాయమని అన్నారు. తెలంగాణ అభివృద్ది ముందు మోడీ నిలవలేరని అన్నారు. తెలంగాణలో అమలవుతున్న ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించాలని, బిజెపి నాటకాలను కూడా ఎండగట్టాలని మంత్రి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. బీఆర్‌ఎస్ హ్యాట్రిక్ విజయం సాధిస్తుందని, ఎగిరేది గులాబీ జెండేనని చెప్పారు. సీఎం కేసీఆర్ వ్యవసాయానికి ఉచిత విద్యుత్ సరఫరా చేయడంతో తెలంగాణ రైస్ బౌల్‌గా మారిందన్నారు. నీటి సరఫరాతో ధాన్యాగారంగా మారిందన్నారు. వడ్లను కొనే దమ్ముకూడా బిజెపి ప్రభుత్వానికి లేదని మండిపడ్డారు. కుంటిసాకులు చెప్పడం, విమర్శలు చేయడం తప్ప బిజెపితో ఏవిూ కాదన్నారు. ఇకపోతే విద్యుత్, నీటి సరఫరా పెరగడంతో యాసంగి, వానకాలం సీజన్లలో రైతులు పుష్కలంగా పంటలు పండిరచి అన్నదాతలుగా మారారని అన్నారు.కల్యాణలక్ష్మి, షాదీముబారక్, రైతుబంధు, రైతుబీమా, పింఛన్లలాంటి అనేక సంక్షేమ పథకాలు పొందిన ప్రజలు బీఆర్‌ఎస్‌ను గెలిపిస్తారని చెప్పారు. మహిళలు ఆరోగ్యంగా ఉండేందుకు ఆరోగ్య మహిళా పథకం, కంటి వెలుగు శిబిరాల ద్వారా నిరుపేద ప్రజలకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి కండ్లద్దాలు అందజేస్తున్నామని వివరించారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు చేస్తున్న అబద్ధపు ప్రచారాలను బీఆర్‌ఎస్ కార్యకర్తలు తిప్పికొట్టాలని పిలుపు నిచ్చారు. కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల ప్రజలు తమ గ్రామాలను తెలంగాణలో కలపమని కోరుతున్నారని, సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులవుతున్నారని గుర్తుచేశారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కెసిఆర్ కృషి చేస్తున్నారని అన్నారు. బీఆర్‌ఎస్ పార్టీకి కార్యకర్తలే పెద్ద బలగం అన్నారు. రైతుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ అనేక పథకాలు ప్రవేశపెట్టారు. దీంతో వ్యవసాయం పండుగలా మారి రైతులంతా లక్షాధికారులవుతున్నారు. ఆత్మీయ సమ్మేళనం నిర్వహణతో కార్యకర్తల్లో ధైర్యం పెరిగింది. రానున్న ఎన్నికల్లో బీఆర్‌ఎస్ విజయం సాధిస్తుంది. బీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. అన్నివర్గాల సంక్షేమం కోసం కృషిచేస్తున్న బీఆర్‌ఎస్ గెలుపుకోసం కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలి. అభివృద్ధి పనులు చేస్తూ నిరంతరం ప్రజల్లో ఉంటున్న నేతలనే మళ్లీ గెలిపించేందుకు అహర్నిశలు కృషి చేయాలన్నారు.