శ్రీ భద్రకాళి అమ్మవారి సన్నిధానంలో శాకాంబరీ నవరాత్ర మహోత్సవాలు శనివారం మూడో రోజుకు చేరుకున్నాయి. ఉదయం అమ్మవారిని ‘‘కుల్లా’’ క్రమంలో అలంకరించారు. ‘‘కుల్లా’’ భూమిని ఉద్ధరించిందని, అందుకే అమ్మవారిని ‘కుల్లా’గా పిలుస్తారని ఆలయ ప్రధాన అర్చకుడు భద్రకాళి శేషు తెలిపారు. నారాయణమూర్తిలోని వారాహి శక్తియే ఈ కుల్లా మాత అని పేర్కొన్నారు. అమ్మవారిని తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి శ్రీదేవి కుటుంబ సభ్యులు, కేంద్ర మంత్రి అనిల్ రాజార్, ఎంపీ ఓంప్రకాష్ మాధుర్ , మాజీ ఎమ్మెల్యే ధర్మారావు, బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ తదితరులు దర్శించుకున్నారు.
-వరంగల్ వాయిస్, కల్చరల్