- కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డి
వరంగల్ వాయిస్, హైదరాబాద్ : కిర్గిస్థాన్ లో చోటు చేసుకుంటున్న ఘటనలపై భారతీయ విద్యార్థులందరూ క్షేమంగా ఉన్నారని వారిని భారత దేశానికి తిరిగి తీసుకొచ్చేందుకు అన్ని విధాలుగా కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి జై శంకర్, కేంద్ర హోం మంత్రి అమిత్ షా లతో మాట్లాడుతున్నానని, త్వరలోనే స్వదేశానికి వస్తారని జీవీకే ఎడ్యుటెక్ బృందానికి కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డి తెలియజేశారు. ఈ మేరకు మంగళవారం ఇటీవల జరిగిన అల్లర్ల గురించి అడిగి తెలుసుకొని అక్కడ సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని, ఎవరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదన్నారు. సోషల్ మీడియాలో వస్తున్న వదంతులు నమ్మవద్దని జీవీకే ఎడ్యుటేక్ డైరెక్టర్ విద్య కుమార్ తెలిపారు. సలహాల కోసం భారత ప్రభుత్వం భారత రాయబార కార్యాలయం హెల్ప్ లైన్ నెంబర్ 0555710041 సంప్రదించగలరని సూచించారు.
