Warangalvoice

warangal voice

కావేరీ కంపెనీ పత్తి విత్తనాల క్షేత్ర పదర్శన

వరంగల్ వాయిస్, దామెర : శనివారం రోజున దామెర మండలం పెంచికలపేటలో రైతు రవీందర్ వ్యవసాయ క్షేత్రంలో కావేరీ కంపెనీ వారి ప్రత్తి విత్తనాల క్షేత్ర పదర్శన ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి స్థానిక రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతు రవీందర్ మాట్టాడుతూ తాను కావేరీ కంపెనీ వారి పత్తి విత్తనాలు వాడి అధిక దిగుబడులు సాధించానని, అంతే కాకుండా ఈ విత్తనాలు అధిక మన్నికతో ఉండడమే కాకుండా, చీడపీడలకు తావులేకుండా మంచి దిగుబడిని ఇస్తున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సుమారు 150 మందికి పైగా రైతులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన కావేరీ కంపెనీ టీసీఎం జి.నితిన్ రైతులు అడిగిన పలు సందేహాలకు సమాధానగా ఈ రకం పత్తి విత్తనాలు రసం పిల్చుకునే పురుగులను నివారించడమే కాకుండా  బెట్ట వాతావరణాన్ని తట్టుకొని నిలబడుతాయని, అంతే కాకుండా అధిక దిగుబడులను ఇస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రైతులతో పాటు కంపెనీ ప్రతినిధిలు రాజు , గణేష్, గణేష్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.

warangal voice
Kaveri Company cotton seed field visit

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *