- ముక్కెర రామస్వామి జిల్లా కార్యదర్శి
వరంగల్ వాయిస్, వరంగల్ : సీఐటీయూ 54 ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కరీమాబాదు ఏరియా కమిటీ ఆధ్వర్యంలో నూతన జెండాను సీఐటీయూ జిల్లా కార్యదర్శి ముక్కెర రామస్వామి ముఖ్య అతిథిగా పాల్గొని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన పాల్గొని మాట్లాడుతూ సీఐటీయూ ఆవిర్భవించి నేటికి 54 సంవత్సరాలు అవుతుందన్నారు. ఐక్యత పోరాటం అనే నినాదాన్ని ఐదు దశాబ్దాల నుంచి ఆచరణలో పెట్టడానికి తీవ్రమైన ప్రయత్నాలు జరిగాయని తెలిపారు. ముఖ్యమైన నినాదాన్ని ఆచరణలో అమలు చేసేందుకు అవిశ్రాంతంగా సీఐటీయూ నిరంతరం పోరాటం కొనసాగిస్తుందన్నారు. దేశంలోనే ట్రేడ్ యూనియన్ ఉద్యమం ప్రారంభంలో సీఐటీయూ ఒంటరి అయినప్పటికీ ప్రయత్నాలు అధిగమించడమే కాకుండా నేడు కార్మిక వర్గానికి కాపాడడం, ఐక్య ఉద్యమాలను అభివృద్ధి చేయడంలో, కార్మిక వర్గం హక్కులు, వేతనాలు, ప్రయోజనాలను, పని పరిస్థితులను మెరుగుపరచడంలో ఛాంపియన్ గా సీఐటీయూ ముందు నిలిచి గుర్తింపు పొందిందన్నారు. 1970 అక్టోబర్ లో ఆవిర్భవించిన సీఐటీయూ అన్ని రకాల దోపిడీ వర్గాల నుంచి సమాజాన్ని విముక్తి చేయడానికి అండగా నిలుస్తుంది. ఉత్పత్తి, పంపిణీ, వినిమయానికి సంబంధించిన అన్నింటిని సమాజంపరం చేయడం ద్వారా సోషలిస్టు రాజ్యాన్ని స్థాపించడం ద్వారానే కార్మిక వర్గం దోపిడీ అంతం చేయవచ్చని సీఐటీయూ నమ్ముతుందన్నారు. కేంద్రంలోని మోడీ నేతృత్యంలో బీజేపీ ప్రభుత్వం తన పదేళ్ల పదవీ కాలంలో నయా ఉదారవాద విధానాలను దూకుడుగా అనుసరిస్తూ ఆర్ఎస్ఎస్ హిందుత్వ మత విభజన ఎజెండాను ప్రోత్సహించిదని మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వం మతోన్మాద విధానాలకు వ్యతిరేకంగా రాబోయే రోజులలో పెద్ద ఎత్తున కార్మిక హక్కులను కాపాడేందుకు సీఐటీయూ ముందుంటుందని తెలిపారు. కార్మిక వర్గం అంతా తమ హక్కులను కాపాడేందుకు ఎర్రజెండా కింద ఉండి పోరాటాలు ఉధృతం చేయాలని ఈ సందర్భంగా ముక్కెర రామస్వామి కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గున్నాల ప్రభాకర్, ఎండీ సాజియా, మద్దూరి రవీందర్, మహబూబ్, మార్గం కిరణ్, గోపాల్, సదానందం, మల్లేశం, మురళి, రాజ్ కుమార్, ఎండీ ఇస్మాయిల్, లక్ష్మి, జుబేదా, భాగ్య, యాదగిరి, కాజా తదితరులు పాల్గొన్నారు.
