నగరంలోని 20 డివిజన్ కాశిబుగ్గకు చెందిన వంగరి లక్ష్మీపతి బ్రదర్స్ ప్రతి ఏడు వినాయక నిమజ్జనంలో కొత్తదనాన్ని ప్రదర్శిస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. ఆనవాయితీని కొనసాగిస్తూ బుధవారం కారుపై శివలింగాకారంలో గణపతులను అందంగా అలంకరించి పురవీధుల్లో ఊరేగించారు. ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన గణపయ్యను చూసేందుకు భక్తులు ఎగబడ్డారు. అనంతరం చిన్న వడ్డేపల్లి చెరువులో నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో వంగరి కుటుంబ సభ్యులు వంగరి రాజశేఖర్, రవి, గుండు చంద్రమోహన్, దేవలపల్లి నరేష్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
-వరంగల్ వాయిస్, కాశిబుగ్గ