వరంగల్ వాయిస్, మహబూబాద్ : జిల్లా కేంద్రంలో దొంగలు బీభత్సం సృష్టించారు. తాళం వేసిన ఇంటిని టార్గెట్ గా చేసుకొని చోరికి పాల్పడ్డారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని జర్నలిస్ట్ కాలనీలో ఓ ఇంట్లో కిరాయికుంటున్న సుందర్ అనే కానిస్టేబుల్ ఇంట్లో చోరీ చేశారు. తులం బంగారం, రూ.46,000 నగదు దొంగలు అపహరించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని క్లూస్ టీంతో నమూనాలు సేకరించడంతో పాటు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
