Warangalvoice

Warangal Voice

కాంగ్రెస్ సత్యాగ్రహ..

  • సోనియా, రాహుల్ గాంధీలపై ఈడీ విచారణపై ఆగ్రహం
  • ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పార్టీ శ్రేణుల దీక్షలు
  • అక్రమ కేసులను వెంటనే రద్దు చేయాలని డిమాండ్
  • హనుమకొండలో ‘నాయిని’ ఆధ్వర్యంలో నిరసన

వరంగల్ వాయిస్, హనుమకొండ: ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీపై ఈడీ అక్రమ నోటీసులు జారీ చేయడాన్ని, రాహుల్ గాంధీని అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ టీపీసీసీ ఆదేశాల మేరకు బుధవారం కాంగ్రెస్ పార్టీ హనుమకొండ, వరంగల్ జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా కాంగ్రెస్ భవన్ లో “సత్యాగ్రహ దీక్ష” నిర్వహించారు. ఈ సందర్భంగా నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ.. దేశంలో ప్రతిపక్షాలు, ప్రజాస్వామ్యం, ప్రజల పక్షాన పోరాటాలు చేసే వారు లేకుండా చేయాలని బీజేపీ చేస్తున్న కుట్రలో భాగంగానే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ లపై అక్రమ కేసులు పెట్టి ఈడీ విచారణ పేరిట వేధింపులకు పాల్పడుతున్నారని విమర్శించారు. దీనిపై దేశప్రజలు ఆలోచించాలని, మోడీ పాలనలో ఆకాశాన్ని అంటిన నిత్యావసర వస్తువుల ధరలు, పెరిగిన పెట్రోల్, డీజిల్, చివరకు పసిపిల్లలు తాగే పాలపైన కూడా జీఎస్టీ విధించడంతో ప్రజలు తీవ్రమైన దుఃఖంలో ఉన్నారని అన్నారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని అధికారంలోకి వచ్చిన మోడీ గత కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏర్పాటుచేసిన ప్రభుత్వ రంగ సంస్థలను ఇతర సంపదను అమ్మివేస్తూ ఉద్యోగ అవకాశాలు లేకుండా చేశారన్నారు. నేషనల్ హెరాల్డ్ పత్రిక కాంగ్రెస్ పార్టీదని, కాంగ్రెస్ పత్రికకి కాంగ్రెస్ పార్టీ డబ్బులను అప్పుగా ఇచ్చిందని, ఇందులో మనీ లాండరింగ్ జరిగిందని విచారణ చేయడం ప్రజలను తప్పు దోవ పట్టించడమే అని మండిపడ్డారు. సోనియా గాంధీ , రాహుల్ గాంధీ ల కు మద్దతుగా నిలిచి దేశాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య ,వర్ధన్నపేట కో ఆర్డినేటర్ నమిండ్ల శ్రీనివాస్, కార్పొరేటర్లు తోట వెంకన్న,పోతుల శ్రీమాన్,పులి అనిల్ కుమార్,స్టేట్ కో ఆర్డినేటర్ తౌటం రవీందర్,రూరల్ ఉపాధ్యక్షులు కొండేటి కొమురారెడి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బంక సంపత్, అంబేడ్కర్ రాజు, మైనారిటీ ప్రెసిడెంట్ అజీజుల్ల బెగ్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు పెరుమండ్ల రామకృష్ణ, మైనారిటీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ మొయినుద్దీన్,హసన్ పర్తి మండల అధ్యక్షుడు మహేందర్ రెడ్డి, మహిళ కాంగ్రెస్ అధ్యక్షులు బంక సరళ ,గుంటి స్వప్న,సమత,ఎంపీపీ సౌజన్య, స్రవంతి,భారతి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు మహ్మద్ అంకుస్, ప్రవీణ్ ,అర్శం అశోక్ ,యూత్ కాంగ్రెస్ నాయకులు అలువాల కార్తిక్,తోట పవన్,ఆంజనేయులు,కొండ శివ,క్రాంతి భరద్వాజ్, పాషా, టింకు,బొంత సారంగం, రంగు సుధీర్, ఇప్ప శ్రీకాంత్, ప్రశాంత్,డివిజన్ ప్రెసిడెంటు లు వల్లేపు రమేష్, శ్రీధర్ యాదవ్,రవి కిరణ్,రవి కుమార్, కొండ నాగరాజ్ , సంతోష్, అజహర్ , వెంకటయ్య తరుతరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *