వరంగల్ వాయిస్, పరకాల : కాంగ్రెస్ పార్టీ బలపరచిన వరంగల్-ఖమ్మం-నల్గొండ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న విజయాన్ని ఆకాంక్షిస్తూ, పరకాల శాసనసభ్యుడు రేవూరి ప్రకాష్ రెడ్డి నాయకత్వంలో శనివారం ఉదయం పరకాల పట్టణంలోని పట్టభద్రులను కాంగ్రెస్ నేతలు, నాయకులు కలిసి ప్రచారం చేశారు. బ్యాలెట్ పేపర్ లో సీరియల్ నెంబర్ రెండవ వరుసలోని తీన్మార్ మల్లన్న ఎదురుగా ఉన్న బాక్స్ లో మొదటి (1) ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరుతూ, కరపత్రం చూపిస్తూ ప్రచారం నిర్వహించారు. పరకాల మాజీ శాసన సభ్యుడు మొలుగూరి భిక్షపతి, పట్టణ ఇంచార్జి గుండపు చరణ్ పటేల్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు కోయ్యడ శ్రీను, సమన్వయ కమిటీ సభ్యులు సోదా రామకృష్ణ, కోలుగురి రాజేశ్వర్ రావు, రంజాన్ అలీ, డాక్టర్. మడికొండ శ్రీను, మెరుగు శ్రీశైలం గౌడ్, చందుపట్ల రఘు, ఒకటో వార్డు కౌన్సిలర్ మడికొండ సంపత్, ఎర్రబెల్లి భాస్కర్ రెడ్డి, దుబాసి వెంకట స్వామి, పసుల రమేష్, ఒంటెరు చిన్న సారయ్య, జాఫర్ రిజ్వి, బండి శ్రీధర్, బొచ్చు భాస్కర్, బండారి జయపాల్ తదితరులు పాల్గొన్నారు.
