- దేశ మహిళా లోకానికి మేల్కొలుపు
- జాతీయ రాజకీయాల్లో బిఆర్‌ఎస్‌కు తొలి అడుగు
- మున్ముందు మరింతగా చొచ్చుకు పోయే ఛాన్స్
- భాష,హావభావాలతో ఆకట్టుకున్న కవిత
వరంగల్ వాయిస్,న్యూఢిల్లీ: బిఆర్‌ఎస్ జాతీయ రాజకీయాలకు తొలి అడుగు పడిరది. దేశానికి సంబంధించిన ఓ పెద్ద సమస్యను ప్రజల దృష్టికి తీసుకుని వచ్చే క్రమంలో బిఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత చేపట్టిన దీక్ష దేశ ప్రజలను ఆలోచన చేసేలా చేసింది. దేశంలోని మహిళలంతా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న మహిళా రిజర్వేషన్ బిల్లుపై కవిత ప్రకటించిన యుద్దం బిజెపికి కనువిప్పు అయినా.. కాకున్నా.. దేశంలో బిఆర్‌ఎస్ పోరాటానికి మాత్రం పునాది పడిరదనే చెప్పాలి. అంతకు మించి కవిత తన హిందీ ప్రావీణ్యంతో ఉత్తరాదిని ఆకట్టుకునే నాయకురాలిగా కూడా ఎదగగలదని నిరూపించారు. ఉత్తరాదిలో ఎంతగా ఇంగ్లీషు ప్రావీణ్యం ఉన్నా వారు హిందీకే ప్రాధాన్యం ఇస్తారు. ఈ క్రమంలో కవిత తన విూడియా సమావేశంలోనూ, దీక్షా శిబిరంలోనూ మాట్లాడిన తీరు ఎంతో హుందాగా,హృద్యంగా కూడా ఉంది. సమస్యను సూటిగా చెప్పగలరని నిరూపించారు. తెలుగు వారిని, ముఖ్యంగా తెలంగాణ వారిని ఇప్పటికే ఆకట్టుకున్న కవిత ఇక దేశ ప్రజలను ఆకట్టుకోవడంలో ఏ మాత్రం సందేహం లేదని నిరూపించారు. తన వాగ్ధాటిని ఇకముందు మరింతగా ప్రదర్శించే అవకాశాలు ఎన్నో ఉన్నాయి. జాతీయ రాజకీయాల్లోకి వెళుతున్న బిఆర్‌ఎస్ కవితను జాతీయ నేతగా ప్రోత్సహించడం ద్వారా మహిళా బలగాన్ని సవిూకరించు కునే అవకాశం వచ్చింది. తెలంగాణ జాగృతి లాగా భారత జాగృతి కూడా దూసుకుని పోతుందనడంలో సందేహం లేదు. సమస్యలను ప్రజెంట్ చేయడంలో కవితకు నైపుణ్యం ఉందని ఢిల్లీ విూడియా కూడా ప్రశంసిస్తోంది. జాతీయ సమస్యలను ప్రస్తావిస్తూ కవితతో పాటు ఇక వాగ్ధాటి కలిగిన నేతలను ఎంచుకుని ముందుకు సాగాల్సిన బాధ్యత ఇప్పుడు కెసిఆర్‌పై ఉంది. బిజెపిని ఢీకొనాలంటే వాగ్దాటితో సమస్యలను ఎత్తిచూపే నాయకత్వం అవసరం. అలాంటి కోవలో అనేకులను ఎంచుకోవాల్సి ఉంది. కవితను పూర్తిగా జాతీయ రాజకీయాల్లో కొనసాగేలా చేయగలగాలి. ఇకముందు ఎంపిలను, ఎంపిక చేసుకునే క్రమంలో హిందీ,ఇంగ్లీష్ ప్రావీణ్యంతో పాటు వాగ్ధాటి ఉన్న నేతలను ఎంచుకుంటే తప్ప బిఆర్‌ఎస్ లక్ష్యం నెరవేరదు.
’తెలంగాణ జాగృతి సంస్థ’ అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాల విశిష్టతను ఖండాంతరాలకు వ్యాప్తిచెందేలా కృషిచేశారు. బతుకమ్మ పండగను అధికారికంగా నిర్వహించేస్థాయికి తీసుకొచ్చారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం అసెంబ్లీలో ప్రతిష్టించే దాకా అలుపెరుగని పోరాటం చేసి విజయం సాధించారు. మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం దేశవ్యాప్తంగా మహిళలను ఐక్యం చేసి ఢల్లీి వేదికగా జంతర్‌మంతర్‌లో ధర్నా చేపట్టారు. ఈ నేపథ్యంలో కవిత దీక్షకు దేశవ్యాప్తంగా మద్దతు లభించింది. దేశంలో ఉన్న మహిళలను కూడగట్టడంలో..వారిని ఆలోచించేలా చేయడంలో కవిత విజయం సాధిస్తారు. ఆ సంకల్పం, తపన ఆమెకు మెండుగా ఉంది.. ఇలాంటి మరెన్నో సమస్యలతో ముందుకు సాగితే ఆమె తప్పకుండా జాతీయ రాజకీయాల్లో ఓ ఫైర్ బ్రాండ్ కాగలదు. ఇక మహిళా రిజర్వేషన్ల విషయానికి వస్తే ఇది బిజెపి ఎజెండాలో ఉన్నదే. దానినే తీసుకుని కవిత తన పోరాటానికి శ్రీకారం చుట్టారు. ఈ రకంగగా అటు భారత జాగృతి కూడా ప్రజల్లో చొచ్చుకు పోగలదు. లిక్కర్ స్కామ్ అన్నది చిన్న విషయం. ఆదానీకి చేస్తున్న మేళ్లతో పోలిస్తే ఇదో సమస్యే కాదు. పోరాటలకు తగ్గట్లుగా దేశ రాజకీయాలు అనుకూలంగా ఉన్నయనడంలో సందేహం లేదు. మహిళల ఎజెండాను కవిత మరింతగా దేశంలో చొచ్చుకుని పోయేలా చేయగలిగారనడంలో సందేహం లేదు.
