Warangalvoice

Warangal_baldia

కలెక్టరేట్ లో బతుకమ్మ సంబురాలు

వరంగల్ వాయిస్, హనుమకొండ : జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో సద్దుల బతుకమ్మ సంబురాలు అత్యంత ఘనంగా జరిగాయి. కలెక్టరేట్ ప్రాంగణంలోని వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించిన మహిళా ఉద్యోగినులు పెద్ద ఎత్తున బతుకమ్మ వేడుకల వేడుకల్లో పాల్గొని అందంగా పేర్చిన బతుకమ్మలతో మహిళా ఉద్యోగినులు వారి పిల్లలు బతుకమ్మ ఆటపాటలతో సందడి చేశారు. బతుకమ్మ పండుగ వేడుకలు మహిళల ఆటపాటల మధ్య అత్యంత వైభవంగా ఘనంగా జరిగాయి.మహిళలు బతకమ్మ పాటలకు చేసిన నృత్యాలు తెలంగాణ సంస్కృతిని ప్రతిబింభించాయి. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ పి.ప్రావిణ్య అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథులుగా విచ్చేసిన
వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు కడియం కావ్య, స్థానిక శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి, వర్ధన్నపేట శాసనసభ్యులు నాగరాజు మాట్లాడుతూ దేవీ నవరాత్రుల్లో మహిళల్ని శక్తి రూపంగా పూజించే గొప్ప సంస్కృతి మనదన్నారు. పువ్వులను దేవతలుగా పూజించే గొప్ప పండుగ ప్రపంచంలో ఒక్క బతుకమ్మ పండుగ మాత్రమే అని పేర్కొన్నారు. అలాంటి గొప్ప పండుగ వేడుకల్లో మహిళా ఉద్యోగినులతో కలిసి పాల్గొనడం చాలా సంతోషాన్ని ఇస్తుందని పేర్కొన్నారు. జిల్లాలోని ప్రజలందరికీ ఉద్యోగస్తులందరికీ వారి కుటుంబ సభ్యులకు సద్దుల బతుకమ్మ, దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లా కలెక్టర్ పి.ప్రావిణ్య మాట్లాడుతూ దేవీ నవరాత్రుల్లో మహిళల్ని శక్తి రూపంగా పూజించే గొప్ప సంస్కృతి మనదని పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లో అత్యంత వైభవంగా బతుకమ్మ వేడుకలు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుందని పేర్కొన్నారు. ఈ వేడుకల్లో పాల్గొనడం తనకు ఎంతగానో ఆనందాన్నిస్తుందని పేర్కొన్నారు. జిల్లాలోని ప్రజలు, ఉద్యోగులు అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని దేవీ నవరాత్రుల సందర్భంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని అన్నారు.
జిల్లాలోని ప్రజలందరికీ దసరా, బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. టీఎన్జీఓ జిల్లా అధ్యక్షులు ఆకుల రాజేందర్ మాట్లాడుతూ తెలంగాణలోని హనుమకొండ జిల్లాలోని కలెక్టరేట్ లో ప్రతి సంవత్సరం బతుకమ్మ వేడుకలను ఘనంగా జరుపుతామని మహిళా ఉద్యోగినులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారని పేర్కొంటూ మహిళా ఉద్యోగులందరికీ సద్దుల బతుకమ్మ, దసరా పండుగ శుభాకాంక్షలు తెలియ జేశారు. గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షులు ఎన్నమనేని జగన్మోహన్ రావు మాట్లాడుతూ ఉద్యోగ సోదరీమణులు వారి కుటుంబ సభ్యులు అందరూ ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో తులతూగాలని కోరుకుంటూ జిల్లాలోని ఉద్యోగులందరికీ బతుకమ్మ, దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఉత్తమంగా పేర్చిన బతుకమ్మలకు అతిథులు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో నీలిమ రాజేందర్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్ మానస రాంప్రసాద్, జాయింట్ కలెక్టర్ వెంకట్ రెడ్డి, డీఅర్ఓ గణేష్, కలెక్టరేట్ ఏఓ సత్యనారాయణ, ట్రేసా అధ్యక్షులు భాస్కర్, జిల్లా అధికారులు డీఎంహెచ్ఓ లలితా దేవి, నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం అధ్యక్షులు దాస్య నాయక్, జాయింట్ కలెక్టర్ వెంకట్ రెడ్డి, ఉద్యోగ సంఘాల నేతలు బైరి సోమయ్య, డాక్టర్ ప్రవీణ్, పుల్లూరు వేణుగోపాల్, పనికెల రాజేష్, శ్యాంసుందర్, కత్తి రమేష్, సారంగపాణి, మోయిస్, లక్ష్మీప్రసాద్, జిల్లా నేతలు, రాజ్యలక్ష్మి, శ్రీలత, పావని, సింధూరాని, రజిత, సరస్వతి, యమునా, రాజమణి, రజిత, శ్రీవాణి, కల్యాణి, గ్రేస్, శిరీష, కల్పన, మంజుల, స్వాతి, మాధవి, పద్మజ, సంధ్యారాణి, ఫాతిమా, సలీం, చీకటి శ్రీనివాస్, రాజమౌళి, కుమారస్వామి, సురేష్, రాజేష్ ఖన్నా, గోపికృష్ణ, రాంప్రసాద్, రామాంజనేయులు, గౌతమ్, భగవాన్ రెడ్డి, ప్రవీణ్, రాజేశ్వర్ రెడ్డి, రాజీవ్, అనుప్, పృద్వి, ప్రణయ్ తదితరులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.

Warangal_Baldia
Bathukamma Sambaru in the Collectorate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *