మరోమారు అధికారులకు మంత్రి ఆదేశాలు వరంగల్ వాయిస్,హైదరాబాద్: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌పై తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. కొత్తగా కేసులునమోదవుతున్న నేపథ్యంలో ఆ దిశగా వైద్యఆరోగ్య శాఖ యంత్రాంగం అప్రమత్తమైంది. వ్యాప్తి వార్తల నేపథ్యంలో అధికారులు కరోనా నివారణను దృష్టిలో పెట్టుకుని అనుమానితులను గుర్తించి భయాన్ని పోగొట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొవిడ్`19 వ్యాప్తి నిరోధానికి తీసుకున్న చర్యల మేరకు అధికారులు కృషి చేస్తున్నారు. మంత్రి హరీష్ రావు ఎప్పటికప్పుడు అధికారులతో సంప్రదించి ఆరా తీస్తున్నారు. ఆదేశాల మేరకు జిల్లాల్లోనూ వైద్య శాఖ అప్రమత్తమైంది. వైద్య విద్యార్థుల సహకారంతో అనుమానితులను పర్యవేక్షించనున్నారు. వ్యాధి అనుమానితులు దవాఖానకు వస్తే వెంటనే శాంపిల్స్ తీసుకుని పంపించేలా ఏర్పాట్లు చేశారు. కరోనా వైర్‌స నివారణకు అవగహన ఒక్కటే నివారణకు మార్గం అని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు అన్నారు. కరోనా వ్యాధికి వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినందున భయాలు లేకుండా అందరూ టీకా తీసుకోవాలని మంత్రి హరీష్ రావు అన్నారు. దీనిపై ప్రజలకు అవగహన కల్పించి వారిని వైర్‌సబారిన పడకుండా కాపాడాలన్నారు. ప్రజలు కరోనాపై అపోహలతో భయబ్రాంతులకు గురికావొద్దాన్నారు. మనిషికి మనిషికి మధ్యదూరం కనీసం విూటర్ ఉండాలన్నారు. కరోనా బాధితులు తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు, తుంపర్ల ద్వారా కరోనా వ్యాప్తి చెందుతుందన్నారు. బహిరంగ ప్రదేశాల్లో తిరిగేటప్పుడు అందరూ నోటికి, ముక్కుకు అడ్డంగా మాస్క్‌లు ధరించాలన్నారు. ప్రజలు గుంపులు గుంపులుగా ఒక చోటికి చేరవద్దన్నారు. చేతులను తరుచు శుభ్రంగా సబ్బుతో కడుక్కోవాలన్నారు. గర్భిణులు, బాలింతలు, పిల్లలు, వృద్ధులు వైర్‌సబారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. చలి ప్రదేశాల్లో తిరగకుడదన్నారు.