- వారాహికి ప్రత్యేక పూజలో పాల్గొన్న పవన్ కళ్యాణ్
వరంగల్ వాయిస్,విజయవాడ: కొండగట్టులో తొలిపూజ చేసిని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ బుధవారం విజయవాడలోని శ్రీ కనక దుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రచారరథం వారాహికి ప్రత్యేక పూజలు జరిపించారు. అనంతరం పవన్ వేదపండితుల ఆశీర్వచనం తీసుకున్నారు. ఆలయ అర్చకులు పవన్ కు తీర్థప్రసాదాలు అందజేశారు. అమ్మవారి ఆశీస్సుల కోసం ఇంద్రకీలాద్రికి వచ్చానని పవన్ అన్నారు. మంగళవారం కొండగట్టులో వారాహికి పూజలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఆలయ ప్రాంగణంలో రాజకీయాలు మాట్లాడనని.. ఏపీ సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నానట్లు చెప్పారు. రాజకీయల్లో కొత్త నాయకులు రావాలని కోరుకుంటున్నానని, రాక్షస పాలనను తరిమికొట్టడమే వారాహి లక్ష్యమని పవన్ స్పష్టం చేశారు. పవన్ పర్యటన సందర్భంగా విజయవాడ, ఇంద్రకీలాద్రి పరిసరాల్లో పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు. జనసేన అధినేత పవన్ రెండ్రోజుల పాటు ఏపీలోనే పర్యటించనున్నారు. ఇందులో భాగంగా ఆయన మంగళగిరిలోని పార్టీ ఆఫీసులో జనసైనికులతో సమావేశమై ఎస్సీ, ఎస్టీ సబ్‌ఎª`లాన్‌పై చర్చించనున్నారు. గురువారం పార్టీ కార్యాలయంలో జరిగే గణతంత్ర వేడుకల్లో పాల్గొంటారు.
