- 28న విచారణకు హైదరాబాద్‌కు రావాలని సూచన
వరంగల్ వాయిస్,కడప: కడప ఎంపి అవినాష్ రెడ్డికి సిబిఐ మళ్లీ నోటీసులిచ్చింది. ఈనెల 28న విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొంది. మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి హైదరాబాద్‌లోని సిబిఐ కార్యాలయంలో మంగళవారం ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని అవినాష్‌రెడ్డికి సిబిఐ నోటీసులు జారీ చేసిన సంగతి విదితమే. అయితే.. ఆరోజు ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాలు ఉండటంతో తాను విచారణకు హాజరు కాలేనంటూ సిబిఐకి అవినాష్ రెడ్డి లేఖ రాశారు. ఈ నేపథ్యంలో… ఈ నెల 28న విచారణకు హాజరుకావల్సిందిగా ఎంపి అవినాష్ రెడ్డికి సిబిఐ మళ్లీ నోటీసులిచ్చింది.
