ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి వారి బ్రహ్మోత్సవాల జాతర వాల్ పోస్టర్ ను బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు ఆలయ ప్రాంగణంలో ఆవిష్కరించారు. ఈ నెల 13నుండి ఉగాది వరకు జరగనున్న బ్రహ్మోత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో రానున్న నేపథ్యంలో చేపడుతున్న ఏర్పాట్లను ఎమ్మెల్యే గారు పరిశీలించారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఏర్పాట్లు చేయాలనీ సంబంధిత శాఖ అధికారులకు సూచించారు. అన్ని శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పని చేసి జాతరను విజయవంతం చేయాలనీ కోరారు.

ఈ కార్యక్రమంలో మండల ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, ఆలయ ఈవో, ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.