- వీడియో విడుదల చేసిన రెడ్ బస్ సీఈఓ ఫణీంద్ర సామ
వరంగల్ వాయిస్, హనుమకొండ : ఏనుగుల రాకేష్ రెడ్డికి మద్దతుగా నిలబడండని రెడ్ బస్ సీఈఓ ఫణీంద్ర సామ పట్టభద్రులను కోరారు. గురువారం ఆయన బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డిని గెలిపించాలని కోరుతూ ఓ వీడియో విడుదల చేశారు. రాకేష్ బిట్స్ పిలానీలో తన జూనియర్ అని, బిట్స్ పిలాని రోజుల్లో రాకేష్ రెడ్డి ఆల్రౌండర్, చదువులతో పాటు, విద్యార్థి నాయకుడిగా ప్రధాన కార్యదర్శిగా పని చేశారని వెల్లడించారు. నిర్మాణ్ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించి ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారని తెలిపారు. దేశం మారుతున్న క్రమంలో ఉన్నత విద్యావంతులు రాజకీయాల్లో అవసరమని గుర్తు చేశారు. జీవితంలో అన్ని పరిస్థితులను ఎదుర్కొన్న రాకేష్ రెడ్డి లాంటివాళ్ళు గెలిస్తే బాగుంటుందని సూచించారు. దేశానికి ఏదైనా చెయ్యాలనుకునే వారు రాకేష్ లాంటి మంచి నాయకుడిని ఎన్నుకోండి చాలు అని కోరారు. ప్రజలు రాకేష్ లాంటి ఉన్నత విద్యావంతులను, తెలివైన వాళ్లను ఎన్నుకోవాల్సి అవసరం ఉందన్నారు.
