Warangalvoice

BRS won the MLC election

ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ దే గెలుపు

  • మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి

వరంగల్ వాయిస్, పరకాల : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలంగాణ సమాజం, మేధావులు ఆలోచించి ఓటు వేయాలని, చట్టసభల్లో నిజాయితీతో కూడిన తెలంగాణ గళం వినిపించాలంటే.. ఒక సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చిన బిడ్డ, బిట్స్ పిలానీలో చదివిన విద్యాధికుడైన ఏనుగుల రాకేశ్ రెడ్డికే మొదటి ప్రాధాన్యత ఓటువేయాలని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో భాగంగా హనుమకొండలోని వారి నివాసంలో నియోజకవర్గంలోని ముఖ్య నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జడ్పీ చైర్మన్, ఎంపీ అభ్యర్థి మారేపెల్లి సుధీర్ కుమార్ తో పాటు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటు బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేశ్ రెడ్డికి వేసి గెలిపించాలని పట్టభద్రులను కోరారు. నియోజకవర్గంలో ఓటు హక్కు ఉన్న 15 వేల పట్టభద్రులను బీఆర్ఎస్ శ్రేణులు వారిని ప్రత్యక్షంగా కలిసి ఓటు అభ్యర్థించాలన్నారు. బీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధి, సంక్షేమాన్ని గమనించాలని ఓటర్లను కోరారు. కాంగ్రెస్ బోగస్ హామీలను, మోసాలను ప్రజలకు వివరించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ప్రతి క్లష్టర్ లో ఉన్న గ్రామాలకు ఆ గ్రామాల్లో ఉన్న వారిని బాధ్యులను చేస్తూ ఇంచార్జిలను నియమించాలన్నారు. ప్రతి ఓటరును కలిసి ఓటు అభ్యర్థించాలన్నారు. పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామన్నారు. ఎవరి బెదిరింపులకు భయపడాల్సిన పనిలేదన్నారు.

 

BRS won the MLC election
BRS won the MLC election

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *