- పిలుపునిచ్చిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
వరంగల్ వాయిస్, హనుమకొండ : వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఏనుగుల రాకేశ్ రెడ్డిని గెలిపించాలని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు. ఉన్నత విద్యావంతులు, యువకులు, నిజాయితీపరులు రాజకీయాల్లోకి రావాలని, ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. ఒక వ్యాపారం చెడిపోతే ఆ వ్యాపారి మాత్రమే నష్టపోతారు. ఒక వ్యక్తి ఆరోగ్యం చెడిపోతే ఆ శరీరానికి మాత్రమే నష్టం కానీ, రాజకీయాల్లో చెడు వ్యక్తులు, స్వార్థ పరులు, మోసగాళ్లు ఉంటే మాత్రం మొత్తం సమాజమే చెడిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి, ఉన్నత విద్యావంతులు, నిజాయితీపరులు, ప్రజాసేవ పట్ల అంకితభావం గల యువత రాజకీయాల్లోకి రావాలి రాణించాలి అని తపనపడే వారిలో నేనూ ఒకరిని అన్నారు. అందరికి సుపరిచితుడు, మిత్రుడు రాకేష్ రెడ్డికి మద్దతు ఇవ్వాలని కోరుతూ వీడియో విడుదల చేశారు. ఈ నెల 27 జరిగే ఎన్నికల్లో సీరియల్ నెంబర్ 3పై గల ఏనుగుల రాకేష్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి ఒక మంచి భవిష్యత్ నాయకుడిని కాపాడుకోవాలన్నారు.
