Warangalvoice

Win Gujjula Premender Reddy as MLC

ఎమ్మెల్సీగా గుజ్జుల ప్రేమేందర్ రెడ్డిని గెలిపించండి

  • వరంగల్ జిల్లా బీజేపీ ఉపాధ్యక్షుడు రాదారపు శివకుమార్

వరంగల్ వాయిస్, మొగిలిచెర్ల : వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డికి మద్దతుగా వరంగల్ జిల్లాలోని, పరకాల నియోజకవర్గం, గీసుకొండ మండలం, గ్రేటర్ వరంగల్ 15వ డివిజన్ మొగిలిచర్లలో బీజేపీ డివిజన్ అధ్యక్షుడు బిల్లా రమేష్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఓటర్స్, ప్రైవేట్ టీచర్స్, ప్రభుత్వ ఉద్యోగులు, డిగ్రీ అయిపోయి ఎమ్మెల్సీ ఓటు ఉన్న అభ్యర్థుల ఇండ్లకు వెళ్లి ప్రచారం చేశారు. గుజ్జుల ప్రేమేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు ఎందుకు వేయాలో వివరిస్తూ పాంప్లెంట్ పంచుతూ, డోర్ స్టిక్కర్ వేస్తూ కలవడం జరిగింది. ఈ కార్యక్రమానికి బీజేపీ వరంగల్ జిల్లా ఉపాధ్యక్షుడు రాదారపు శివకుమార్ హాజరై మాట్లాడుతూ కాంగ్రెస్ అభ్యర్థి చింతపండు నవీన్, అలియాస్ తీన్మార్ మల్లన్నకు ఓటు వేసిన, బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డికి ఓటు వేసిన అవి మురికి కాలువలో వేసినట్టేనని అన్నారు. తీన్మార్ మల్లన్న గెలిచినా, ఏనుగుల రాకేష్ రెడ్డి గెలిచినా డిగ్రీ పట్టభద్రులకు, ప్రైవేటు ఉద్యోగస్తులకు ఒరిగేది ఏమీ లేదన్నారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థి గెలిస్తే ప్రైవేట్, ప్రభుత్వ, డిగ్రీ అయిపోయి నిరుద్యోగులుకు ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ఉపయోగపడుతుందన్నారు. కాబట్టి, ప్రతి బీజేపీ కార్యకర్త, బిజెపి నాయకులు భారతదేశ సరిహద్దు సైనికుల వలె గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గెలుపు కోసం అహర్నిశలు శ్రమించి పనిచేయాలని కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా జిల్లా కార్యదర్శి ఆడెపు రమేష్, సొసైటీ డైరెక్టర్ లెంకలపల్లి స్వామి, రాచమల్ల వీరస్వామి, రాధారపు మల్లికార్జున్, కునమల్ల రవి, కార్యకర్తలు పాల్గొన్నారు.

Win Gujjula Premender Reddy as MLC
Win Gujjula Premender Reddy as MLC

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *