- విప్లవాత్మక రాజకీయాలకు శ్రీకారం
- చంద్రబాబు దూరదృష్టితో అభివృద్దికి పెద్దపీట
- జగన్ పాలనలో దోచుకు తింటున్నారు
- ఆర్థిక వ్యవస్థను దివాళా తీసి అప్రతిష్ట పాల్చేసారు
- మండిపడ్డ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్

వరంగల్ వాయిస్,అనంతపురం: దివంగత ఎన్టీఆర్ ప్రభంజనం సృష్టించి దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేస్తే..ఆయన వారసుడిగా చంద్రబాబు ఉమ్మడి ఎపిని ఎంతో అభివృద్ది చేశారని అన్నారు. తెలుగువేశం పార్టీ రాజకీయాల్లో కొత్త ఒరవడి సృష్టించిందన్నారు. చంద్రబాబునాయుడు ఎంతో ముందు చూపుతో రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తే..జగన్ ధనయజ్ఞం చేస్తున్నారని ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ మండిపడ్డారు. రాష్టాన్న్రి ఆర్థికంగా దివాళా తీసి నాశనం చేశారని అన్నారు. మద్యనిషేధం కాస్తా కాసులవేట పథకంగా మారింద న్నారు. ఆర్థికంగా రాష్ట్రం దివాళా తీసిందన్నారు. ఇకపోతే అభివృద్ది ఆగిందని అన్నారు. చంద్రబాబు హయాంలో రాయలసీమకు నీటి తరలింపు కోసం ముచ్చుమర్రి చేపట్టి నీటి తరలింపును సాకారం చేశారని అన్నారు. హంద్రీ`నీవా ద్వారా కుప్పంకు నీళ్లు ఇవ్వాలని లక్ష్యంతో పుంగనూరు నుంచి కుప్పం వరకు రూ.800 కోట్లు ఖర్చుచేసి కాలువలు, కల్వర్టులు, బ్రిడ్జిలు కట్టించారని తెలిపారు. పులివెందులకు గండికోట నుంచి నీళ్లు ఇచ్చినట్లు తెలిపారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మట్టి పనులు చేపట్టి జలయజ్ఞం పేరుతో ధనయజ్ఞం చేశారన్నారు. రాయలసీమ జిల్లాలను సస్యశ్యామలం చేసేందుకు ప్రాజెక్టులు చేపట్టిన ఘనత చంద్రబాబుదే అని అన్నారు.గోదావరిలో 1000 టీఎంసీల నీళ్లు వృథాగా సముద్రంలో కలుస్తున్నాయని, వాటిని వాడుకుని రాయలసీమకు నీళ్లు తేవాలని పట్టిసీమ కడితే దానిపై లేనిపోని ఆరోపణలు చేయడం తగదన్నారు. పట్టిసీమ ద్వారా 16 లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చి పంటలు కాపాడిన ఘనత నాటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుదేనన్నారు. సమస్యల పరిష్కారం కోసం ప్రజలు కార్యాలయాల చుట్టూ ప్రదక్షణలు చేసే అవస్థలు లేకుండా ఆనాడు చర్యలు తీసుకున్న ఘనత చంద్రబాబుదని అన్నారు. రాజకీయాలకతీతంగా ప్రతి లబ్ధిదారునికి రేషన్‌కార్డులు, పింఛన్లు అందించిన ఘనత తెదేపాకే దక్కిందన్నారు. ప్రతి పేదకుటుంబం సంక్రాంతిని ఆనందంగా జరుపుకోవాలనే లక్ష్యంతో ఆనాడు చంద్రబాబునాయుడు సంక్రాంతి కానుకలను అందిస్తే ఇప్పుడు రేషన్ కూడా రాని దుస్థితి కల్పించాన్నారన్నారు. మహిళలకు ఎపిలో రక్షణ లేకుండా పోయిందని కేశవ్ అన్నారు. చంద్రబాబు నాయుడును విమర్శించే స్థాయి వైకాపా నేతలకు లేదని పేర్కొన్నారు. నియంతృత్వ విధానాలతో చీకటి చట్టాలతో ప్రజలను అడ్డుకోవాలని చూస్తున్నారని అన్నారు. జగన్‌కు కాలం చెల్లిందని, ఎప్పుడు ఎన్నికలు జరిగినా మళ్లీ టిడిపి ప్రభజంనం సృష్టిస్తుందన్నారు. బాబును పవన్ కళ్యాణ్ కలవడాన్ని కూడా వైసిపి భయపడుతోందన్నారు.