- కన్నుల పండువగా వేడుకలు
- వేలాదిగా తరలి వచ్చిన భక్తులు
వరంగల్ వాయిస్, వరంగల్ : సీతారాముల కల్యాణ మహోత్సవ వేడుకలను బుధవారం ఎస్ ఆర్ ఆర్ తోటలోని శ్రీ వీరాంజనేయ దేవాలయంలో కన్నుల పండువగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కల్యాణ తంతు నిర్వహించారు. సుమారు మూడు గంటల పాటు సాగిన ఈ కల్యాణోత్సవంలో స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సీతారాముల కల్యాణాన్ని తిలకించేందుకు వీలుగా ఎల్ ఈడీ స్క్రీన్ ఏర్పాటు చేశారు. వివాహనంతరం భక్తులకు ఆశీర్వచనం నిర్వహించి ప్రసాద వితరణ గావించారు. భక్తులకు బెల్లం పానకం అందించారు. ఈ సందర్భంగా నిర్వహించిన అన్నదానం భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అదే విధంగా 32వ డివిజన్ పరిధిలో ఆటో స్టాండ్ ఏరియాలోని శ్రీ వీరాంజనేయ దేవాలయం, వినాయక కాలనీలో జరిగిన కల్యాణ మహోత్సవంలో స్థానిక కార్పొరేటర్ పల్లం పద్మ రవి వాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ పెద్దలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాల్లో మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంట రవి తదితర ప్రముఖులు పాల్గొన్నారు.
40వ డివిజన్ లో..
అండర్ రైల్వే గేట్ ప్రాంతంలోని ఉర్సు శ్రీ బీరన్న స్వామి దేవాలయంలో శ్రీరామనవమి వేడుకలు కన్నుల పండువగా సాగాయి. సీతారాముల కల్యాణోత్సవం సందర్భంగా ఉర్సులోని కురుమ కుల పెద్ద శ్రీ బీరన్న స్వామి దేవాలయ చైర్మన్, 40 వ డివిజన్ కార్పొరేటర్ మరుపల్ల రవి ఇంటి నుంచి శ్రీ సీతారామ లక్ష్మణుడు. ఆంజనేయ స్వామి విగ్రహాలను డప్పు చప్పుల్లతో ఉర్సు ప్రతాప్ నగర్ నుంచి శ్రీ బీరన్న స్వామి దేవాలయం వరకు ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఇట్టి ఊరేగింపులో మాజీ కార్పొరేటర్ మరుపల్ల భాగ్యలక్ష్మి, ఆలయ పూజారి బలబద్ర భాస్కర్, మరుపల్ల గౌతమ్, చీర రాజు, అడప శ్యాం, దేవి ఎలేంద్ర, ఉమా, దీపిక, దమయంతి. మరుపల్ల కార్తికేయ. అన్న చెర్రీ తదితరులు పాల్గొన్నారు. అనంతరం శ్రీ సీతారాముల కల్యాణాన్ని కన్నుల పండువగా నిర్వహించారు.