- ఒకరిని కాపాడిన స్థానికులు
వరంగల్ వాయిస్, హనుమకొండ : గుండ్ల సింగారం కేనాల్ లో ఈతకు వెళ్లిన ఇద్దరు బాలురు గల్లంతయ్యారు. సెయింట్ తామస్ స్కూల్ లో ఆరో తరగతి చదువుతున్న చరణ్, విగ్నేశ్వర్ సోమవారం సాయంత్రం గుండ్ల సింగారం కేనాల్ లో ఈతకు వెళ్లారు. నీటిలోకి దిగిన వీరు ప్రవాహంలో కొట్టుకుపోయారు. వీరిని యాదవ్ నగర్ సమీపంలో స్థానికులు గుర్తించి తాడు సహాయంతో రక్షించే ప్రయత్నం చేశారు. అయితే చరణ్ మాత్రం తాడు సహాయంతో ఒడ్డుకు చేరుకోగా విగ్నేశ్వర్ కెనాల్ లో కొట్టుకు పోయినట్లు స్థానికులు వెల్లడించారు.